Sunil Birthday: మళ్లీ హీరో అవతారమెత్తనున్న సునీల్‌.. ఈసారి ‘మర్యాద కృష్ణయ్య’గా వస్తున్న భీమవరం బుల్లోడు..

Sunil New Movie: కామెడీకి కొత్త అర్థం చెబుతూ టాలీవుడ్‌లోకి దూసుకొచ్చాడు నటుడు సునీల్‌. కమెడియన్‌గా ఓ రేంజ్‌లో దూసుకెళుతోన్న సమయంలోనే హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 'అందాల రాముడు' సినిమాలో లీడ్‌ రోల్‌లో నటించిన సునీల్..

Sunil Birthday: మళ్లీ హీరో అవతారమెత్తనున్న సునీల్‌.. ఈసారి 'మర్యాద కృష్ణయ్య'గా వస్తున్న భీమవరం బుల్లోడు..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 28, 2021 | 12:29 PM

Sunil New Movie: కామెడీకి కొత్త అర్థం చెబుతూ టాలీవుడ్‌లోకి దూసుకొచ్చాడు నటుడు సునీల్‌. కమెడియన్‌గా ఓ రేంజ్‌లో దూసుకెళుతోన్న సమయంలోనే హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ‘అందాల రాముడు’ సినిమాలో లీడ్‌ రోల్‌లో నటించిన సునీల్ హీరోగా మంచి మార్కులే కొట్టేశాడు. ఇక అనంతరం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’ చిత్రంతో ఒక్కసారిగా సూపర్‌ సక్సెస్‌ను అందుకున్నాడు. ఇక అనంతరం పూర్తిగా హీరో పాత్రలకే పరిమితమైన సునీల్‌ విజయాలను మాత్రం అందుకోలేకపోయాడు. వరుస సినిమాలు పరాజయం పాలవడంతో మళ్లీ సైడ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించడం మొదలు పెట్టాడు. ఇక ఇదే క్రమంలో కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా నటించాడు సునీల్‌. ఇదిలా ఉంటే తాజాగా సునీల్‌ మరోసారి హీరోగా మారుతున్నాడు. ‘మర్యాద కృష్ణయ్య’ అనే సినిమాలో టైటిల్‌ రోల్‌లో నటిస్తూ మళ్లీ హీరోగా తన అదృష్టాన్ని చెక్‌ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా సునీల్‌ పుట్టినరోజును (ఫిబ్రవరి 28) పురస్కరించుకొని చిత్ర యూనిట్‌ ‘మర్యాద కృష్ణయ్య’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఏటీవీ ఒరిజినల్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సునీల్‌ ఇందులోనూ భయస్తుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి మర్యాద రామన్నతో హీరోగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సునీల్‌ మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కుతాడో లేదో చూడాలి.

Also Read: Shanmukh Jaswanth Deepthi Sunaina: దీప్తితో బ్రేకప్ అయ్యిందా..? షణ్ముఖ్‌ జశ్వంత్ సోషల్ మీడియా లైవ్‌లో క్లారిటీ ఇచ్చేశాడు

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ తదితరాలకు సరికొత్త ప్యాకేజ్, ఆరు రోజుల టూర్‌లో అబ్బుర పరిచే ప్రదేశాల సందర్శనం