కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ తదితరాలకు సరికొత్త ప్యాకేజ్, ఆరు రోజుల టూర్‌లో అబ్బుర పరిచే ప్రదేశాల సందర్శనం
India Tourism : ఉత్తరభారతదేశంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక ధామాలు కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌కు ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజ్ ప్రకటించింది...
India Tourism : ఉత్తరభారతదేశంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక ధామాలు కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌కు ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజ్ ప్రకటించింది. ఆరు రోజుల టూర్‌లో అబ్బుర పరిచే ప్రదేశాల దర్శనం కలిగేలా ట్రిప్ ప్లాన్ చేసింది ఐఆర్‌సీటీసీ. సాగరనగరం విశాఖపట్నం నుంచి మొదలై కాశీ, అయోధ్య, అలహాబాద్ తదితర ప్రఖ్యాత ప్రదేశాల సందర్శన ఈ ప్యాకేజ్ లో ఉన్నాయి. మొత్తంగా ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ‘హోలీ అయోధ్య కాశీ యాత్ర’ పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.26,780. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.28,399 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.35,070 గా ఉంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ కూడా అవుతాయి.
ఇక, ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవాళ్ల టూర్ ప్లాన్ ఎలా ఉంటుందో చూద్దాం.. విశాఖపట్నుం నుంచి టూర్ 2021 ఏప్రిల్ 11న ప్రారంభం అవుతుంది. మొదటి రోజు ఉదయం 8.50 గంటలకు విశాఖపట్నంలో ఫ్లైటే ఎక్కితే మధ్యాహ్నం 2.40 గంటలకు వారణాసి చేరుకుంటారు. సాయంత్రం గంగానది తీరంలో సంధ్యాహారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఆ తర్వాత రాత్రి వారణాసిలోనే బస చేయాలి. రెండో రోజు ఉదయం కాశీలో విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ ఆలయాలను సందర్శించాలి. మధ్యాహ్న భోజనం తర్వాత సారనాథ్ బయల్దేరాలి. ఆ తర్వాత సాయంత్రం తిరిగి వారణాసికి బయల్దేరాలి. రాత్రి వారణాసిలోనే బస చేయాలి. మూడో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్ (అలాహాబాద్) బయల్దేరాలి. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. సంగం, అలాహాబాద్ ఫోర్ట్, పాతాల్‌పురి ఆలయం సందర్శించొచ్చు. రాత్రికి అలాహాబాద్‌లోనే బస చేయాలి.
నాలుగో రోజు ఉదయం 9 గంటలకు అయోధ్యకు బయల్దేరాలి. నాలుగు గంటల్లో అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్య, రామజన్మభూమి, లక్ష్మణ్ ఘాట్, కనక్ భవన్ ఆలయం సందర్శించొచ్చు. సాయంత్రం సరయూ నది తీరంలో హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. రాత్రికి అయోధ్యలోనే బస చేయాలి. ఐదో రోజు ఉదయం హోటల్‌లో చెక్ ఔట్ అయిన తర్వాత నందిగ్రామ్ బయల్దేరాలి. అక్కడ భారత్ హనుమాన్ ఆలయం, భారత్ కుండ్ సందర్శించొచ్చు. ఆ తర్వాత లక్నో బయల్దేరాలి. అక్కడ అంబేద్కర్ మెమోరియల్ పార్క్ సందర్శించాలి. ఆ తర్వాత లక్నోలో బస చేయాలి. ఆరో రోజు ఉదయం హోటల్‌లో చెక్ ఔట్ కావాలి. ఆ తర్వాత గోమతీ రివర్ ఫ్రంట్ పార్క్ చూడొచ్చు. మధ్యాహ్నం 1.55 గంటలకు లక్నోలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9.45 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ఇక, ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఇదే వెబ్‌సైట్‌లో టూర్ ప్యాకేజీ కూడా బుక్ చేసుకోవచ్చు.
An evening aarti at #Ganga #Ghat in #Varanasi, a holy dip at the confluence of Ganga, Yamuna & Saraswati at #Prayagraj, a visit to the birthplace of #Lord #Ram at #Ayodhya, this 6D/5N #pilgrimage tour is one of its kind. #Book for just Rs.26780/- pp* on https://t.co/H5UbeOxg9G
— IRCTC (@IRCTCofficial) February 26, 2021