AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Dharam Tej: మొదటి అడుగు ఎప్పుడూ కష్టతరమైనదే.. రిషబ్ పంత్ వీడియోను రీట్వీట్ చేసిన సాయి ధరమ్ తేజ్..

గతేడాది డిసెంబర్ 30న క్రికెటర్ రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు ప్రయాణిస్తుండగా.. తెల్లవారుజామున 5 గంటలకు అతడు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని కారు మంటల్లో చిక్కుకోగా.. తీవ్రగాయాలతో బయటపడ్డాడు పంత్. ఆ తర్వాత చాలా కాలం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న పంత్.. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు.

Sai Dharam Tej: మొదటి అడుగు ఎప్పుడూ కష్టతరమైనదే.. రిషబ్ పంత్ వీడియోను రీట్వీట్ చేసిన సాయి ధరమ్ తేజ్..
Sai Dharam Tej
Rajitha Chanti
|

Updated on: Jun 15, 2023 | 7:51 PM

Share

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తేజ్‏కు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. డైరెక్టర్ కార్తీక్ తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటించింది. ఇందులో తేజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా అందుకున్న విజయంతో ఇప్పుడు తేజ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. అదే సమయంలో ఇటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో క్రికెటర్ రిషబ్ పంత్ వీడియో షేర్ చేస్తూ.. ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. “మొదటి అడుగు ఎప్పుడూ చాలా కష్టంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు ఎదుర్కొనే కష్టాల కంటే మీ డెస్టినేషన్ మరింత విలువైనది. కమాన్ చాంప్ మీరు సాధించారు” అంటూ పంత్ ను ఉత్సాహపరిచేలా ట్వీట్ చేశారు.

వివరాల్లోకెలితే.. గతేడాది డిసెంబర్ 30న క్రికెటర్ రిషబ్ పంత్ ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ కు ప్రయాణిస్తుండగా.. తెల్లవారుజామున 5 గంటలకు అతడు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని కారు మంటల్లో చిక్కుకోగా.. తీవ్రగాయాలతో బయటపడ్డాడు పంత్. ఆ తర్వాత చాలా కాలం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న పంత్.. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. కొద్ది రోజులుగా మంచానికే పరిమితమైన పంత్.. ఇప్పుడు ఎవరీ సహయం లేకుండానే మెట్లు ఎక్కుతున్నాడు. ఈ వీడియోను పంత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. సాయి తేజ్ రీట్వీట్ చేస్తూ.. మోటివేషనల్ మేసెజ్ షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

గతంలో 2021లో సాయి ధరమ్ తేజ్ సైతం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మాదాపూర్ నుంచి ఐటెక్ సిటీ వెళ్తున్న సమయంలో బైక్ డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. యాక్సిడెంట్ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి తేజ్.. ఆ తర్వాత కోలుకున్నారు. ప్రమాదం తర్వాత తాను సరిగా మాట్లాడలేకపోయినట్లు ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.