OG Movie: తెలుగు తెరపైకి విలన్గా మరో బాలీవుడ్ హీరో.. పవన్ కళ్యాణ్ సినిమాలో రొమాంటిక్ స్టార్..
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో పవర్ స్టార్ మరింత స్టైలీష్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం పలు పరిశ్రమల నుంచి కీలకపాత్రల కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఇందులో తమిళ్ స్టార్ అర్జున్ దాస్, శ్రియా రెడ్డి లను ఎంపిక చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే.. మరోవైపు సినిమా షూటింగ్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో సెట్ పై ఉన్న చిత్రాల్లో OG ఒకటి. సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇందులో పవర్ స్టార్ మరింత స్టైలీష్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా కోసం పలు పరిశ్రమల నుంచి కీలకపాత్రల కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఇందులో తమిళ్ స్టార్ అర్జున్ దాస్, శ్రియా రెడ్డి లను ఎంపిక చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ.. ఇమ్రాన్ పోస్టర్ షేర్ చేసింది చిత్రయూనిట్. ఇమ్రాన్ హష్మి ఎంట్రీతో నార్త్ ఇండస్ట్రీలోనూ ఓజీకి మంచి మార్కెట్ ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో పవన సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలోకి మరికొంత మంది నటీనటులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా 90’s బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారట. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఈసినిమానే కాకుండా.. డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో బ్రో మూవీ చేస్తున్నారు పవన్. ఇందులో సాయి తేజ్ కీలకపాత్రలో నటిస్తుండగా.. షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందీ మూవీ.
When we have the #OG, we should also have a badass who is powerful and striking… ????
Presenting you all, the nemesis @EmraanHashmi! #FireStormIsComing ?#TheyCallHimOG ? pic.twitter.com/CmBBTFvSdR
— DVV Entertainment (@DVVMovies) June 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.