Sai Dharam Tej: అందుకే ఆ పాప విషయంలో నేను సీరియస్‌గా రియాక్ట్ అయ్యా.. అసలు విషయం చెప్పిన తేజ్

తేజ్ మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నారు. తన మేనమామలతో ఉండే బాండింగ్ గురించి, అలాగే తన సినిమాల గురించి కూడా మాట్లాడాడు. అలాగే ఒకప్పుడు ఓ చిన్నారి విషయంలో తేజ్ సీరియస్ అయిన ఇన్సిడెంట్ ను కూడా గుర్తు చేసుకున్నారు.

Sai Dharam Tej: అందుకే ఆ పాప విషయంలో నేను సీరియస్‌గా రియాక్ట్ అయ్యా.. అసలు విషయం చెప్పిన తేజ్
Sai Dharam Tej
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2024 | 6:39 PM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుసగా సినిమాతో బిజీ అయ్యాడు. పిల్ల నువ్వులేనిజీవితం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో.. ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 ఏళ్లు అవుతుంది. దాంతో తేజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు. ఈ సందర్భంగా తేజ్ తన మేన మామ పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్నారు. తేజ్‌ను పవన్ శాలువాతో సత్కరించి పలు బహుమతులు కూడా ఇచ్చారు. ఈ సందర్బంగా తేజ్ మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు పంచుకున్నారు. తన మేనమామలతో ఉండే బాండింగ్ గురించి, అలాగే తన సినిమాల గురించి కూడా మాట్లాడాడు. అలాగే ఒకప్పుడు ఓ చిన్నారి విషయంలో తేజ్ సీరియస్ అయిన ఇన్సిడెంట్ ను కూడా గుర్తు చేసుకున్నారు.

నెట్టింట కాక రేపుతోన్న క్యూటీ.. డీజే పాప దుమ్మురేపిందిగా..

గతంలో ఓ చిన్న పాప తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో పై కొంతమంది అసభ్యకరంగా మాట్లాడటం దాన్ని వీడియో చేసి సోషల్ మీడియాలో పంచుకోవడం పై తేజ్ ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తేజ్ ఆ ఆకతాయిలు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలను షేర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది.. సమాజంలో కొంతమంది ఎదవలు ఉన్నారు అంటూ మండిపడ్డారు తేజ్.

ఇవి కూడా చదవండి

అమ్మడి ఐడీ కావాలా బాబు..! డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ నెట్టింట సెగలు రేపుతోందిగా..!

ఈ విషయం గురించి తేజ్ మాట్లాడుతూ.. చిన్నపిల్లల పై నీచంగా కామెంట్స్ చేయడం.. పిచ్చి పిచ్చి జోక్స్ వేయడం ఏంటీ..? చైల్డ్ అబ్యూస్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు.? ఇలాంటి ఘటనే మా ఫ్యామిలీలోనూ జరిగింది. అందుకే నేను అంత సీరియస్ గా రియాక్ట్ అయ్యాను. మా ఫ్యామిలీలో జరిగినప్పుడు మేమందరం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. వాటిని మేము ఎదురుకున్నాం.. కానీ చిన్న పిల్లల మీద ఇలాంటి నీచమైన కామెంట్స్, జోక్స్ చేస్తే ఆ బాధ పేరెంట్స్ కు మాత్రమే అర్ధమౌతుంది. మా ఫ్యామిలీ లో జరిగింది కాబట్టి నాకు ఆ బాద ఎలా వుంటుందో తెలుసు. పేరెంట్స్ బాధను నేను అర్ధం చేసుకోగలను.. అందుకే ఆ పాప విషయంలో అంత రియాక్ట్ అయ్యా అన్ని చెప్పుకొచ్చాడు తేజ్.

మాజీ సీఎంను రెండో పెళ్లి చేసుకున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

View this post on Instagram

A post shared by Sai DURGHA Tej (@jetpanja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.