మేనమామకు మేనల్లుడు రిటర్న్ గిఫ్ట్.. కొడ్తే బాక్సులు బద్ధలవ్వాల్సిందే..!
గిఫ్టుల సంగతేమోగానీ, రిటర్న్ గిఫ్టుల గురించి మాత్రం ఎప్పుడూ సాలిడ్ డిస్కషన్ ఉంటుంది. సాదాసీదా ఫంక్షన్లకే రిటర్న్ గిఫ్టుల గురించి అంత ప్రెస్టీజియస్‌గా మాట్లాడుకుంటుంటే, మేనమామకి మేనల్లుడు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇంకే రేంజ్‌లో ఉండాలి చెప్పండి? కొడ్తే బాక్సులు బద్ధలైపోవాలి.

గిఫ్టుల సంగతేమోగానీ, రిటర్న్ గిఫ్టుల గురించి మాత్రం ఎప్పుడూ సాలిడ్ డిస్కషన్ ఉంటుంది. సాదాసీదా ఫంక్షన్లకే రిటర్న్ గిఫ్టుల గురించి అంత ప్రెస్టీజియస్‌గా మాట్లాడుకుంటుంటే, మేనమామకి మేనల్లుడు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇంకే రేంజ్‌లో ఉండాలి చెప్పండి? కొడ్తే బాక్సులు బద్ధలైపోవాలి. సపోర్ట్ అంటే ఇలా ఉండాలి అనిపించాలి. పక్కాగా అలాంటి గిఫ్ట్ నే ప్యాక్ చేస్తున్నారట సాయితేజ్.
తెలుగు ఇండస్ట్రీ మర్చిపోలేని హిట్ మూవీస్‌లో నాందికి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అల్లరి నరేష్ యాక్టింగ్‌కి ఎంత మంది ఫిదా అయ్యారో, డైరక్టర్ విజయ్ టేకింగ్‌కి కూడా అంతే మంది ఫ్యాన్స్ అయ్యారు. అల్లరి నరేష్‌కి జబర్దస్త్ హిట్ ఇచ్చిన విజయ్ ఇప్పుడు సాయితేజ్ మీద ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. సాయి తేజ్‌కి చాలా మంచి సబ్జెక్ట్ ని నెరేట్ చేశారట విజయ్. అది కూడా పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్‌కి సాయితేజ్ చేసే సపోర్ట్ లా ఉంటుందని ఇన్‌సైడ్ టాక్.
యాక్సిడెంట్ నుంచి కోలుకున్న సాయితేజ్‌కి మోరల్ సపోర్ట్ ఇవ్వడమే కాదు, స్క్రీన్ స్పేస్ ఇచ్చి మంచి సినిమానే ప్లాన్ చేశారు పవన్ కల్యాణ్. మేనమామ బ్రో తో ఇచ్చిన సపోర్ట్ కి ఇప్పుడు రుణం తీర్చుకునే పనిలో ఉన్నారు సాయితేజ్. అందుకు విజయ్ చెప్పిన కథ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందట. మేనమామ ఐడియాలజీకి ఇప్పుడే కాదు, గతంలోనూ తన సినిమాల త్రూ సపోర్ట్ ఇచ్చారు సాయితేజ్.
చిత్రలహరి సినిమాలో గ్లాస్ మేట్స్ పాటను పవన్‌కల్యాణ్‌కి డెడికేట్ చేయడానికే సాయితేజ్ చేశారన్నది అప్పట్లో వైరల్ న్యూస్. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి పవర్‌ఫుల్ డైలాగులతో, పక్కా స్క్రిప్టుతో గొంతు కలపడానికి ముందుకొస్తున్నారట. అప్పట్లో గ్లాస్‌మేట్స్ కుర్రాడు… ఇప్పుడు ఎదిగి మామకి పర్ఫెక్ట్ పవర్ అందించడానికి కాలర్ సర్దుకుంటున్నాడనే టాక్ వైరల్ అవుతోంది ఫిల్మ్ నగర్‌లో.
మేనమామ పవన్ కళ్యాణ్ అంటే సాయి ధరమ్ తేజ్‌కు చాలా ఇష్టం. వారి ఇద్దరి బాండింగ్ ఈ ట్వీట్‌లో చూడండి..
Wishing a very Happy Birthday to my Chinna Mama, My Guru garu & The Towering People’s Leader @PawanKalyan mama.
Thanks for being my Guardian Angel & Torch Bearer not just for me but millions out there.
Praying you always be in good health, success & peace and I receive more of… pic.twitter.com/1f7c2fOy7B
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.