- Telugu News Photo Gallery Cinema photos Rashmika Mandanna New Movies and upcoming projects in film industry Telugu Actress Photos
Rashmika Mandanna: శ్రీవల్లీ సైలెంట్ అవ్వలేదు.. ఈసారి మరింత క్రేజీగానేషనల్ క్రష్..!
రష్మిక పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు చాలనే ఉన్నాయి. ముంబైలో ఏ ఈవెంట్ అయినా వాలిపోయే రష్మిక లేటెస్ట్ గా అంబానీ ఇంట్లో గణపతి పూజకు హాజరయ్యారు. అక్కడ తీసిన ఫొటోలతో ఆమె పేరును ట్రెండింగ్ చేస్తున్నారు నార్త్ నెటిజన్లు. సౌత్‌లో మాస్ ఆడియన్స్ కి అంతకు మించిన టాపిక్కే దొరికింది రష్మిక పేరును ట్రెండ్ చేయడానికి..!
Updated on: Sep 23, 2023 | 7:10 PM

రష్మిక పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు చాలనే ఉన్నాయి. ముంబైలో ఏ ఈవెంట్ అయినా వాలిపోయే రష్మిక లేటెస్ట్ గా అంబానీ ఇంట్లో గణపతి పూజకు హాజరయ్యారు. అక్కడ తీసిన ఫొటోలతో ఆమె పేరును ట్రెండింగ్ చేస్తున్నారు నార్త్ నెటిజన్లు.

సౌత్‌లో మాస్ ఆడియన్స్ కి అంతకు మించిన టాపిక్కే దొరికింది రష్మిక పేరును ట్రెండ్ చేయడానికి..! వాటే వాటే వాటే బ్యూటీ అంటూ రష్మికను చూసి మొన్న మొన్నటిదాకా సౌత్ ఆడియన్సే పాడుకునేవారు. ఇప్పుడు ఉత్తరాది వారు కూడా ఆ పాట అందుకున్నారు.

నార్త్ లో ఇప్పటిదాకా సాలిడ్ హిట్ పడకపోయినా, ఏదో ఒక సినిమాలో సస్టయిన్ అవుతూనే ఉన్నారు మన శ్రీవల్లి. ప్రస్తుతం తెలుగులో పుష్పరాజ్ పక్కన పుష్ప 2లో బిజీ బిజీగా నటిస్తున్నారు శ్రీవల్లి.

ఈ సినిమాలో ఊరమాస్ గెటప్‌లో కనిపిస్తున్న రష్మిక మరోవైపు కోలీవుడ్‌లో మాత్రం పోష్ పిక్చర్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆల్రెడీ విజయ్‌తో వారసుడులో రంజితమే రంజితమే అంటూ స్టెప్పులేశారు.

ప్రస్తుతం రెయిన్‌బో సినిమాలోనూ బ్యూటీఫుల్ కేరక్టర్ చేస్తున్నారు సిల్వర్‌స్క్రీన్ రంజితం. బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ పక్కన నటించిన యానిమల్ సినిమా వాయిదా పడింది. త్వరలో ఆ సినిమా రిలీజ్ అయితే అక్కడ ఆఫర్స్ క్యూ కడతాయని అంటున్నారు మేడమ్ రష్మిక.

సందీప్ రెడ్డి వంగా సినిమాలో యాక్ట్ చేసిన ఎక్స్ పీరియన్స్ వేరే లెవల్ అన్నది ఈ బ్యూటీ ఇస్తున్న స్టేట్‌మెంట్. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తెలుగులో రవితేజ పక్కన ఓ క్రేజీ ప్రాజెక్టుకి సైన్ చేశారు రష్మిక.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారనే వార్త వైరల్ అవుతోంది. గోపీ - రవి కాంబినేషన్‌లో సినిమా అంటే హీరోయిన్‌కి వండర్‌ఫుల్ కేరక్టర్ కచ్చితంగా ఉంటుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది రష్మిక ఆర్మీలో.





























