AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie Update: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో వింటే అదిరిపోతారు!

రాజమౌళి సినిమా తీస్తున్నారంటేనే రికార్డుల మోత గ్యారెంటీ. మరి ఎన్ఠీఆర్..రామ్ చరణ్ వంటి హీరోలతో మల్టీ స్టారర్ అంటే? ఇదిగో ఇలా.. ఇప్పటివరకూ ఉన్న అన్ని ప్రీ రిలీజ్ బిజినెస్ లనూ మించిపోయేలా.. మళ్ళీ ఇలాంటి బిజినెస్ వచ్చే అవకాశం ఉండదు అనేంతగా.. ఇంతకీ ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన ఆ రికార్డులు ఏమిటో తెలుసుకోండి..

RRR Movie Update: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో వింటే అదిరిపోతారు!
Rrr Movie
Anil kumar poka
|

Updated on: Apr 01, 2021 | 4:44 PM

Share

RRR Movie Update: దర్శకధీరుడు రాజమౌళి సినిమా మొదలెట్టారూ అంటే చాలు సంచలనాలు ప్రారంభం అయినట్టే. బాహుబలి లాంటి సినిమా తీసి ప్రపంచ చలన చిత్ర చరిత్రలో తెలుగు సినిమా స్టామినా రుజువు చేసిన రాజమౌళి మరో సినిమా చేస్తున్నారు అంటే.. అది ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తోందో అనుకున్నారు అందరూ. అనుకున్నట్టుగానే.. రాజమౌళి నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. మూడు ఆర్ ల కలయికతో.. తెలుగు సినిమా చరిత్రలో మళ్ళీ మరో మైలురాయిలా నిలిచిపోయేలాంటి సినిమా లైన్ లో పెట్టారు రాజమౌళి. ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) పేరుతో.. రామ్ చరణ్, ఎన్ఠీఆర్ హీరోలుగా భారీ మల్టీ స్టారర్ సినిమా ప్రకటించారు రాజమౌళి. ఇక అప్పట్నుంచి ఇప్పటిదాకా.. ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ప్రతి వార్తా ఒక రేంజిలో అభిమానులను అలరిస్తూ వస్తోంది.

అక్టోబర్ 13 వ తేదీన ఈ సినిమా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలో రామ్ చరణ్, ఎన్ఠీఆర్ లుక్ లకు అభిమానులు ఫిదా అయిపోయారు. కేవలం వారిద్దరి లుక్ తోనే సినిమా పై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‏కు ఏ రేంజ్‏లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ప్రేక్షకుల అంచనాల లానే.. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అవుతుందనే విషయంలోనూ ఇటు ఇండస్ట్రీ లోనూ అటు ప్రేక్షకుల్లోనూ ఎంతో ఆదుర్దా నెలకొంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు సినిమాకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ బిజినెస్ ఒక రేంజిలో జరిగిందని చెబుతున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం..

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ థీరియాట్రికల్ రైట్స్ 165 కోట్లుగా చెబుతున్నారు. ఇక నైజాం ఏరియాకు 75 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అదేవిధంగాఇతర  దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు 48 కోట్లు, కర్ణాటక 45 కోట్లు, కేరళ 15 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందట. అదేవిధంగా ఉత్తరాదికి సంబంధించి 175 కోట్లకు ఆర్ఆర్ఆర్ బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. అలాగే ఓవర్సీస్ లో 70 కోట్లకు ఆర్ఆర్ఆర్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

ఇక డిజిటల్ రైట్స్ 170 కోట్లకు, శాటిలైట్ రైట్స్ 130 కోట్లకు, మ్యూజిక్ రైట్స్ కు 20 కోట్లు ఈ సినిమా సాధించినట్టు ఇండస్ట్రీ టాక్. అంటే మొత్తం 890 కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ సాధించింది ఆర్ఆర్ఆర్ మూవీ.

రాజమౌళి బాహుబలి 2 కు దక్కిన ప్రీరిలీజ్ బిజినెస్ 500 కోట్లు మాత్రమే. ఇప్పటివరకూ ఇదే రికార్డ్. ఈ రికార్డ్ కు దాదాపుగా డబుల్ సాధించింది ఆర్ఆర్ఆర్ మూవీ. ఇదిలా ఉంటె ఈ సినిమాకు బడ్జెట్ 350 కోట్లని చెబుతున్నారు. అంటే.. నిర్మాతలకు దాదాపుగా 500 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టే అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో ఇదే అతి పెద్ద బిజినెస్ డీల్. ఈ రికార్డు భవిష్యత్ లో ఎవరైనా కొల్లగొట్టగలరా అనేది చెప్పడం కష్టమే. ఇప్పటికే సినిమాపై పెరిగిపోయిన అంచనాలకు తోడు ప్రీ బిజినెస్ రికార్డులు మరింత వేడిని పెంచుతున్నాయి. రాజమౌళి సినిమాలపై ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏమిటో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చెప్పకనే చెబుతోంది.

Also Read: పవన్ కోసమే ఉమెన్ ఎంపవర్‏మెంట్ స్టోరీ.. ‘వకీల్ సాబ్’ సినిమాలో మెయిన్ పాయింట్ అదే.. డైరెక్టర్ వేణు శ్రీరామ్..

Karthi Sulthan Movie: కార్తీ సుల్తాన్ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?