AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthi Sulthan Movie: కార్తీ సుల్తాన్ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

కార్తీ తన ఖైదీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం సాధించారు. ఇప్పుడు సుల్తాన్ గా తెలుగు తెరను పలకరించబోతున్నారు. కార్తీ సుల్తాన్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు మీకోసం.

Karthi Sulthan Movie: కార్తీ సుల్తాన్ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?
Karthi As Sulthan
Anil kumar poka
|

Updated on: Apr 01, 2021 | 3:51 PM

Share

Karthi Sulthan Movie: టాలీవుడ్ సినిమాలు వరుసగా బాక్సాఫీసు మీద దండెత్తుతున్నాయి. ప్రతి వారం కనీసం నాలుగు సినిమాలకు తక్కువ కాకుండా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. చిన్న సినిమాల హవా ఎక్కువగా నడుస్తోంది. వాటితో పాటు మధ్య మధ్యలో తమిళ సినిమాలూ సినిమా ప్రేమికులను పలకరించి మురిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ మొదటి వారంలో కొత్త సినిమాల సందడి మామూలుగా ఉండటం లేదు. వాటితో పాటు ఓ తమిళ సినిమా కూడా రేసులో నిలిచింది.  అది కార్తీ నటించిన సుల్తాన్!

హీరో కార్తీకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. కార్తీ సినిమాలు తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. మొన్నటి ‘ఖైదీ’ సినిమాతో తెలుగునాట కార్తీ ప్రత్యేకమైన ఇమేజి ఉన్న హీరోగా నిలబడ్డారు. ఇప్పుడు కార్తీ నటించిన ‘సుల్తాన్’ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద హంగామా చేయడానికి సిద్ధం అవుతోంది. తెలుగు సినిమా మార్కెట్ లో ఖైదీ తో మంచి మార్కెట్ సాధించిన కార్తీ.. తరువాత వచ్చిన దొంగ సినిమా తో కొంత డీలా పడ్డాడు. కానీ, కార్తీ సినిమాలకు బిజినెస్ పెద్దగా తగ్గినట్టు కనిపించడం లేదు

తాజాగా ‘సుల్తాన్’ సినిమా ఈ నెల 2వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ఫిలిం నగర్ టాక్. దొంగ సినిమాతో కొద్దిగా మార్కెట్ తగ్గేలా కనిపించినా..కార్తీ కొత్త సినిమా సుల్తాన్ కు మాత్రం మంచి డిమాండ్ వచ్చినట్టు తెలుస్తోంది. కార్తీ కూడా సుల్తాన్ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగినట్టు సమాచారం. కార్తీ ఖైదీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఏడుకోట్ల రూపాయలు సంపాదించింది. దీంతో ఇప్పుడు సుల్తాన్ సినిమాకు ఆరుకోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. అంటే ఖైదీ సినిమా సాధించిన వసూళ్ల లెక్కను దృష్టిలో పెట్టుకునే సుల్తాన్ సినిమాను బయ్యర్లు కొన్నట్టు కనిపిస్తోంది.

కార్తీ హీరోగా నటించిన సుల్తాన్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఏరియాల వారీగా ఇలా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

నైజాం 2 కోట్లు, సీడెడ్ కోటి రూపాయలు, ఆంధ్రా మూడు కోట్లు.. మొత్తం ఆరుకోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ సుల్తాన్ సినిమా సాధించింది.

Also Read: ఇప్పటికే నాకు మూడు, నాలుగుసార్లు పెళ్లి చేసారు… ఆసక్తికర విషయాలను చెప్పిన కీర్తి సురేష్..

Diabetes Diet: వేసవిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే స్నాక్స్ ఏమిటంటే..!

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..