Diabetes Diet: వేసవిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే స్నాక్స్ ఏమిటంటే..!

Diabetes Diet: రోజు రోజుకీ డయాబెటిస్ పేషేంట్స్ సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. నివారణ మాత్రమే మార్గం..

Diabetes Diet: వేసవిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే స్నాక్స్  ఏమిటంటే..!
Diabetes Diet
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2021 | 11:03 AM

Diabetes Diet: రోజు రోజుకీ డయాబెటిస్ పేషేంట్స్ సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. నివారణ మాత్రమే మార్గం. అందుల్లనే ఈ వ్యాదిబారిన పడిన వారు.. తినే ఆహారం దగ్గర నుంచి నిద్ర, శారీరక శ్రమ, అన్నింటిపై దృష్టి పెట్టాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ నివారణకు లేదా. వ్యాధిగ్రస్తులు ఫైబర్ అధికంగా ఉండే .. సీజనల్ ఆహారాన్ని తినాలని చెబుతున్నారు. వేసవిలో చల్లని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే మధుమేహవ్యాధి గ్రస్తులు మాత్రం తాము ఏం తినాలి అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే తినే ఆహారంతో షుగర్ లెవెల్ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. మరి డయాబెటిస్ వారు ఎటువంటి ఆహారం స్నాక్స్ గా తీసుకోవాలో చూద్దాం..!

1. పెరుగుతో మొలకెత్తిన సలాడ్ :

మొలకెత్తిన గింజలు.. పెరుగు సలాడ్ ఇది వేసవిలో మంచి ఆహారం. చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాదు తేలికగా జీర్ణం అవుతుంది. మొలకల్లో ఫైబర్ అధికంగా ఉంటాయి. దీనికి క్యారెట్, బీట్ రూట్ వంటి ముక్కలతో పాటు.. దోసకాయ, టమోటా వాటిని జోడించి తింటే మరింత రుచిగా మారుతుంది. అంతేకాదు వీటికి పెరుగు జోడించి స్నాక్స్ గా తీసుకుంటే సమ్మర్ లో మంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ అవుతుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం ఈ స్నాక్స్ సలాడ్

2. కీర దోసకాయ :

వేసవిలో ఎక్కువ చల్లదనాన్ని .. దాహార్తిని తీర్చే వాటిల్లో కీర దోస మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇది కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా కలిగి ఉంటుంది. అంతేకాదు అధిక మొత్తంలో నీరు పోషకాలతో నిండి ఉంటుంది. అనుకునే అల్పాహారం తీసుకునే సమయంలో స్మూతీలకు ఈ కీర ను జతచేయండి.

3. పెసరపప్పు

భారత దేశంలో పెసర పప్పుకి ప్రముఖ స్థానం ఉంది. దీనిలో పోటీన్స్ తో పాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. అందుకని పెసర పప్పు డయాబెటిస్‌ తో పాటు.. కడుపులో మంట, బరువు పెరుగుటను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక పెసర పప్పుతో చేసే స్నాక్స్ ను పెరుగుతో తినడం అటు వేడి నిరోధంగా.. ఇటు షుగర్ పేషేంట్స్ కు మంచి ఆహారంగాను ఉంటుంది.

4. చాట్ , ఉడికించిన గుడ్డు

మన దేశంలో చాట్ అంటే తెలియని వారు ఉండరు.. చాట్ ను రకరకాలుగా తయారు చేస్తారు. అయితే ఈ చాట్ ను ఉడికించిన గుడ్డుతో కలిపి చేసుకోవచ్చు. ఇది అద్భుతమైన అల్పాహారం అని పోషకాహార నిపుణులు అంటున్నారు.

5. ఫ్రూట్ పాప్సికల్స్ :

రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచే మార్కెట్ లో లభించే ఫ్రూట్ పెప్సికల్స్ (ఐస్ క్యాండిల్స్) ను బదులు వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బెర్రీలు, నారింజ, కివీస్, లిట్చిస్ వంటి కొన్ని తాజా పండ్లను తీసుకొని వాటిని ఐస్ ట్రేలో వేసి, కొంచెం నీరు లేదా ఇంట్లో తియ్యని రసం పైన పోయాలి. తర్వాత దానిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక రోజు తర్వాత తినవచ్చు.

Also Read: సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించిన కేంద్రం

పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా బాగున్నారు.. వకీల్ సాబ్ ట్రైలర్ పై రేణు దేశాయ్ ప్రశంసల వర్షం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!