Vakeel Saab Trailer:పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా బాగున్నారు.. వకీల్ సాబ్ ట్రైలర్ పై రేణు దేశాయ్ ప్రశంసల వర్షం

Vakeel Saab Trailer:ప్రముఖ నటి. దర్శకురాలు రేణు దేశాయ్ ..పవన్ కళ్యాణ్ రీ ఎంట్రి మూవీ వకీల్ సాబ్ ట్రైలర్ పై స్పందించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా డిఫరెంట్..

Vakeel Saab Trailer:పవన్ కళ్యాణ్ న్యాయవాదిగా బాగున్నారు.. వకీల్ సాబ్ ట్రైలర్ పై రేణు దేశాయ్ ప్రశంసల వర్షం
Renu Desai
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2021 | 10:10 AM

Vakeel Saab Trailer:ప్రముఖ నటి. దర్శకురాలు రేణు దేశాయ్ ..పవన్ కళ్యాణ్ రీ ఎంట్రి మూవీ వకీల్ సాబ్ ట్రైలర్ పై స్పందించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారని అన్నారు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ ను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ లో వకీల్ సాబ్ లో చూస్తున్నామని అన్నారు. అమ్మాయి తరపున వాళ్ళ కోసం పోరాడే లాయర్ పాత్రలో పవన్ నటన బాగుందని ప్రశంసించారు. మొత్తానికి ట్రైలర్ లో పవన్ ఆటిట్యూడ్ అదిరిపోయిందన్నారు.

ఇక ముఖ్యంగా మీరు వర్జినా అంటూ చివర్లో అబ్బాయిని పవన్ ప్రశ్నించడం బాగుందని.. మొదటి నుంచి చివరి వరకు కూడా వకీల్ సాబ్ ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని రేణు దేశాయ్ తెలిపారు. ఈ సినిమాలో పవన్ లుక్ బాగుందని.. కచ్చితంగా అలరిస్తుందని చెప్పారు రేణు.

ఇక దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో వెండి తెరపై రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కుతుంది. పింక్ సినిమాతో పోలిస్తే తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లు ఈ కథను మార్చాడు శ్రీరామ్ వేణు. వకీల్ సాబ్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ట్రైలర్ అనేక రికార్డులను సృస్తిస్తుంది. విడుదలైన ఒక్కరోజులోనే తెలుగు ఇండస్ట్రీలో మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో మోస్ట్ లైక్డ్ ట్రైలర్‌గా చరిత్ర సృష్టించింది వకీల్ సాబ్. వేసవి వినోదంగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పవన్ కు జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా..ప్రకాష్ రాజ్ ఓ ప్రత్యేక పాత్రలో అంజలి, నివేదా థామస్, అనన్య, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు బోణీ కపూర్ లు నిర్మించారు.

Also Read: : మీతో మాట్లాడను మీరు మీ అమ్మనే ఎంచుకున్నారు.. నన్ను కాదన్న కార్తీక్..

: కోవిడ్ నిబంధనల నడుమ హరిద్వార్ కుంభమేళా.. విశిష్టత ఏమిటో తెలుసా..!

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?