Karthika Deepam Serial: మీతో మాట్లాడను మీరు మీ అమ్మనే ఎంచుకున్నారు.. నన్ను కాదన్న కార్తీక్..

Karthika Deepam Serial: దీప ఇంత దూరం వచ్చి.. ఈ కష్టాన్ని తలకెత్తుకుంది.. రాత్రనక పగలనక కష్టపడుతూ.. తన కూతుర్లను డాక్టర్ బాబు కూతుళ్ళగా పెంచాలని ఆరోగ్యం పాడు చేసుకుంది. పిల్లల మీదే అన్ని..

Karthika Deepam Serial: మీతో మాట్లాడను మీరు మీ అమ్మనే ఎంచుకున్నారు.. నన్ను కాదన్న కార్తీక్..
Karthika Deepam
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2021 | 8:41 AM

Karthika Deepam Serial: దేశ విదేశాల్లో తెలుగులోగిళ్ళలో కార్తీక దీపం ఫ్యాన్ లేనివాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. ఇక సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సాయంత్రం 7.30 గంటలు అవుతుందంటే చాలు టివి స్క్రీన్స్ ముందు చేరుకుంటారు.. అంతగా ఆకట్టుకుంది ఈ సీరియల్. ఈరోజు హైలెట్స్ ఒక్కసారి చూద్దాం..!

దీప ఇంత దూరం వచ్చి.. ఈ కష్టాన్ని తలకెత్తుకుంది.. రాత్రనక పగలనక కష్టపడుతూ.. తన కూతుర్లను డాక్టర్ బాబు కూతుళ్ళగా పెంచాలని ఆరోగ్యం పాడు చేసుకుంది. పిల్లల మీదే అన్ని ఆశలు పెట్టుకుని బతుకుతున్న దీప.. ఇప్పుడు మీరు వచ్చి మీకు మీ కూతుర్లే కావాలని అని అంటే.. అది ఏమైపోతుంది బాబు .. అది ఒంటరిదైపోతుంది.. అప్పుడు ఎవరికోసం బతుకుంటుంది… అంటూ మురళీ కృష్ణ .. కార్తీక్ కి తన ఆవేదన చెబుతాడు.. దీంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు. నేను అడిగింది అది కాదు.. మీకు దీప కనిపించిన తర్వాత మా అమ్మకు ఎందుకు చెప్పలేదు.. అంటాడు. నిజంగా చెప్పలేదు.. అంటాడు మురళీ కృష్ణ.. దీప తన మీద ఒట్టు వేయించుకుంది. అందుకనే మీ అమ్మగారికి దీప కనిపించిన విషయం చెప్పలేదు అంటాడు మురళీకృష్ణ. నా కూతురుమీద ఒట్టు బాబు అమ్మగారికి తెలియదు..

మీకు మీ కూతురు కోసం ఉండిపోయి.. చాకిరీ చేస్తున్నట్లు.. నేను కూడా నా కూతుళ్ళ కోసం నేను కూడా ఉండిపోయి చాకిరీ చేయాలా అని ప్రశ్నిస్తాడు. సలహా చెప్పండి అంటాడు కార్తీక్.. దీంతో నేను మీకు సలహా చెప్పేటంత గొప్పవాడిని కాను బాబు అంటాడు మురళీ కృష్ణ..

ఇంతలో హిమ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ.. మనం ఇక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియదు.. ఫోన్ నెంబర్స్ కూడా మార్చేశాం.. ఎలా తెలిసినట్లు నాన్నకు.. శౌర్య చెప్పి ఉంటుందా అని సందేహం వ్యక్తం చేస్తుంది. దీంతో శౌర్య కోపంగా హిమా అంటూ.. నీకు నామీద డౌట్ ఉందా.. నేను ఎందుకు కాల్ చేస్తాను.. చేస్తే.. దైర్యంగా చెబుతాను.. అంటుంది. నువ్వు వచ్చి అమ్మకు నా మీద పితూరీలు చెబుతావా అని ప్రశ్నిస్తుంది.. దీంతో హిమ.. నువ్వు వచ్చిన కొత్తలో నాన్నకు ఫోన్ చేస్తా అంటూ ఫోన్ తీసుకున్నావుగా అని ప్రశ్నిస్తుంది.. అప్పుడు నేనేగా ఆపింది.. తర్వాత కూడా అమ్మ చిన్న హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని.. నాన్నకు ఫోన్ చేద్దామా అన్నావు.. మరి ఎవరూ చెప్పకుండా నాన్న సరిగ్గా మన ఇడ్లీ బండి దగ్గరకు ఎలా వస్తాడు అని ప్రశ్నిస్తుంది హిమ. నాకు తెలియదమ్మా.. నేను నాన్నకు చెప్పాలనుకున్నాను.. నిజమే..

కానీ ఇప్పుడు నేను ఫోన్ చేయలేదు.. నువ్వు వద్దు అన్న పని నేను నిజంగా చేయనమ్మా ప్రామిస్ అంటూ శౌర్య కన్నీరు పెట్టుకుంటుంది. నాకు ఈ జబ్బుతో ఆరోగ్యం క్షీనిస్తుంది..పిలల్లు ఏమైపోతారో అన్న బెంగ పెరిగిపోతుంది. పిల్లల్ని ఇచ్చెయ్యాలా.. కన్న తండ్రిగా ఒప్పుకోకపోయినా.. కన్నతండ్రిగా చూసుకుంటాడు.. మరి పిల్లల్ని ఇచ్చేస్తే.. నా పరిస్థితి ఏమిటి. ఒంటరిగా బతకగలనా అంటూ ఆలోచిస్తుంది దీప.

ఇక భాగ్యం సౌందర్య ఇంటికి శ్రావ్య కోసం వస్తుంది. ఏమిటమ్మా ఫోన్ చేయడం లేదు అని అంటుంది శ్రావ్య.. నేను మీ నాన్న కోసం చిత్ర పట మాంగళ్య వ్రతం చేస్తున్నా అందుకే రావడం లేదు.. ఇంట్లో వాళ్ళ మూడ్ బాగోలేదు.. మెల్లగా మాట్లాడు అంటుంది. సర్లే ఏమైనా తింటావా.. అని అడుగుతుంది శ్రావ్య.. సౌందర్య, శ్రావ్య మాట్లాడుకుంటుండగా.. సౌందర్య వస్తుంది. టిఫిన్ తినేసి వచ్చింది.. కాఫీ తాగి వెళ్తానంది. అంటుంది శ్రావ్య.. నేను మీతో మాట్లాడానికి వచ్చా వదినా..అయన ఏమైనా ఫోన్ చేశారా.. అని ప్రశ్నిస్తుంది.. కూతురు కనిపించే వరకూ ఇంటికి రానని శబధం చేశారు వదిన అంటూ దిగులు పడుతుంది భాగ్యం.. ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు.. దారీ తెన్నూ లేకుండా ఎక్కడని వెదుకుతున్నారా ఏమో అంటుంది. ఎండలు ముదిరిపోతున్నాయి.. ఎలా తిరిగి వస్తారో అని భయంగా ఉంది. నా ఫోన్ ఎత్తక పోయినా మీకు ఫోన్ చేస్తారు కదా.. అందుకే అడగడానికి వచ్చాను.. పిచ్చి మాలోకం.. పిలిచి పెడితే తప్ప అన్నం మీద కూడా ధ్యాస ఉండదు.. తిని పొమ్మని ఏ హోటల్ వాడు వచ్చి పోతాడు అని భాగ్యం మురళీ కృష్ణ ఆరోగ్యం గురించి దిగులు పడుతుంది.

అమ్మా నాన్నకు ఏమీ కాదు నువ్వు అనవసరంగా భయపడకు అని శ్రావ్య ఓదారుస్తుంది. అత్తయ్యని టెన్షన్ పెట్టకు.. ఆ దైర్యం మీ అత్తగారు కూడా ఇస్తే.. వ్రతం చేసుకుంటా అంటుంది. భాగ్య. ఎం మాట్లాడమంటావు భాగ్యం.. అనవసరంగా ఆ పెద్దమనిషిని పంపి ఇబ్బంది పెట్టాను అంటుంది సౌందర్య.

ఇక కార్తీక్ తో శౌర్య, హిమలు దీప ఆరోగ్యం గురించి మాట్లాడతారు.. అమ్మకు ఏమైంది అని అడుగుతుంది శౌర్య.. ఏమీ కాలేదు.. మీరు భయపడ్డారా అని ఆడుగుతాడు కార్తీక్.. అవును డాడీ అంటుంది హిమ. అమ్మకు నిజంగా బాగా జబ్బు చేసింది. ఒక్కసారి మేమె మందుల షాపుకి వెళ్లి మందులు తెచ్చామని అంటారు.. అమ్మకి ఏమి జబ్బు చేసింది డాడీ అంటుంది. హిమ..

అయితే అమ్మని మమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికే వచ్చారా నాన్నా అంటుంది శౌర్య. అది నిజమా డాడీ అందరిని తీసుకుని వెళ్తావా అంటుంది హిమ.. దీంతో కార్తీక్ మాట మారుస్తూ.. అసలు నేను మీతో ఎందుకు మాట్లాడాలి చెప్పండి.. మీకు అమ్మకావాలా.. నాన్న కావాలా అని అడిగితె నాన్న కావాలి అని అన్నారా అని ప్రశ్నిస్తాడు కార్తీక్ తన కూతుర్లకు. మీ అమ్మతో వెళ్లిపోయారు. అందుకు మాట్లాడాలా..? మీ అమ్మ సమన్లు సర్ది ఊరి మారుతుంటే.. నాకు ఫోన్ చేశారా..? అక్కడ మీ అమ్మ మాటే విన్నారు.. ఇడ్లి దుకాణం పెట్టారు. మీ అమ్మకి ఇలా జబ్బు చేసిందని నాకు ఒక ఫోన్ అయినా చేశారా.. ఎందుకు మాట్లాడాలి అంటాడు కార్తీక్. మీరు బాగా గుర్తుకు వచ్చారు.. అందుకే కదా నాన్న టిఫిన్ సెంటర్ అని పేరు పెట్టాం.. ఎవరో వచ్చి మీ నాన్న ఎవరు అని అడిగితె ఏమని చెబుతారు.. ఆరోజు అందరూ ఏడిచేశాం.. నాన్నా మమల్ని తీసుకుని వెళ్ళండి..నువ్వు లేకపోతె అసలు బాగోలేదు అని హత్తుకుంటారు.

దీంతో కార్తీక్ నన్ను ఏమి చేయమంటారు..మీ అమ్మరావడానికి నేను ఒప్పుకోను.. మిమ్మల్ని తీసుకుని వెళ్తానంటే.. మీ అమ్మ ఒప్పుకోదు.. అని ఆలోచిస్తుంటాడు

దీప తో మురళీ కృష్ణ.. ఎక్కడమ్మా డాక్టర్ బాబు అని అడుగుతాడు.. పిల్లల్ని తీసుకుని రిపోర్ట్స్ పట్టుకుని వెళ్లారు నాన్న.. ఏమైనా మాట్లాడారా అని అడుగుతాడు. అదే భయంగా ఉంది.. ఆయన వెదుకుంటూ వచ్చారన్న ఆనందంకన్నా భయం ఎక్కువగా ఉంది నాన్న అంటుంది.. పిల్లల్ని నానుంచి వేరు చేసి తీసుకుని వెళ్ళిపోతారేమో అంటూ ఆందోళన పడుతుంది. అదేం లేదు.. పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసేటంత కర్కోటకుడు కాదమ్మా అంటాడు మురళీ కృష్ణ.

ఇంతలో కార్తీక్ వస్తాడు.. పిల్లల్ని ఏమి చేద్దామనుకుంటున్నావు.. నీలాగే వంటలక్కలు చేద్దామనుకుంటున్నావా.. ఆడపిల్లని బండి దగ్గర పెట్టడానికా. అని అంటాడు.వాళ్ళని నేను రానివ్వను.. అని దీప అంటే.. నేను వచ్చేసరికి అక్కడే ఉంది హిమ అంటూ కసురుతాడు. నేను ఎన్నిసార్లు కాదన్నా నువ్వు వాళ్ళు నా పిల్లలే అన్నావు.. మరి నా పిల్లల్ని ఇలా ఊర్లు పట్టుకుని తిరుగుతున్నావు.. ఎవరిని బెదిరించాలని.. ఎవరు దిగిరావాలని.. అని అంటాడు.మీరు వస్తారని నేను అనుకోలేదు అంటుంది దీప. రావాలని అనుకోలేదా .. అంటే మీరు వస్తారని నేను అనుకోలేదు అంటుంది దీప. లేక మీ అమ్మగారు ఇచ్చిన కోట్లు వాడుకుంటున్న అనుకుంటున్నారా..? ఏ తల్లి కావాలని పిల్లని పేదరికంలోకి నెట్టెయ్యదు. కొన్నాలు పొతే ఈ బండి ఓ హోటల్ గా మారవచ్చు.. మా కష్టం కాస్త పెరిగినా పిల్లలు సుఖంగా పెరగడానికి చాలినంత ఆదాయం పెరగవచ్చు. అందాకా ఈ బండిలాగే.. బతుకు బండిని తోసుకుంటూ ఉంటానని చెబుతుంది దీప. నీకు ఆదాయం పెరిగినంతమాత్రన పిల్లల భవిష్యత్ లో ఏ మాత్రం మార్పు రాదు.. పిల్లల్ని చెరో ఇడ్లి బండి పెట్టించేటంత ఆదాయం వస్తుందేమోగాని.. డాక్టరుగానో కలెక్టర్ గానో చూడలేవు అంటాడు. మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు.. అంటుంది .. మరి దీపని పిల్లని తీసుకుని వస్తాడా..? పిల్లని మాత్రమే కావాలనుకుంటాడా రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే..!

Also Read: కోవిడ్ నిబంధనల నడుమ హరిద్వార్ కుంభమేళా.. విశిష్టత ఏమిటో తెలుసా..!

Samantha Akkineni: మరో మైలురాయిని చేరుకున్న అక్కినేనివారింటి కోడలు సమంత

క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..