Ragi Health Benefits: రాగి జావతో ఈ రోగాలన్నింటికీ చెక్ పెట్టవచ్చు.. అవెంటో తెలుసా?

Ragi Malt Benefits: భారతదేశంలో క్రీస్తుపూర్వం నాటి నుంచి నుంచి వినియోగంలో ఉన్న చిరుధాన్యాల ఆహారంలో రాగులు ఒకటి. తృణధాన్యాలైన

Shaik Madar Saheb

|

Updated on: Apr 01, 2021 | 5:43 AM

Ragi Malt Benefits: భారతదేశంలో క్రీస్తుపూర్వం నాటి నుంచి నుంచి వినియోగంలో ఉన్న చిరుధాన్యాల ఆహారంలో రాగులు ఒకటి. తృణధాన్యాలైన రాగులలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి. దీంతోపాటు బీ విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయి. రాగులు చాలా మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. కావున రోజూ రాగి జావ తాగితే కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలసుకుందాం.

1 / 6
రోజూ ఉదయాన్ని రాగి జావ తాగితే చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అభిప్రాయడుతున్నారు. రాగులను ఉప్మాలా చేసుకోని తిన్నా.. శరీరానికి అధిక బలం చేకూరుతుంది. మొలకెత్తిన రాగులు తిన్నా మేలే. ముఖ్యంగా శరీరానికి చేకూర్చే బలమైన పోషకాలన్నీ రాగులల్లో లభిస్తాయి.

2 / 6
రాగుల్లో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉన్నాయి. కావున రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని పేర్కొంటున్నారు. రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది.

3 / 6
రాగుల్లో ఎక్కువగా పీచు పదార్ధాలు ఉన్నాయి. కావున వీటివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్ద పేగు కాన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుంది. బరువును కూడా తగ్గిస్తాయి.

4 / 6
రాగులు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి అంటు వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరును పెంచుతాయి. ఎముకలు ధృఢంగా ఉంచడమే కాకుండా కండరాలకు బలం చేకూరుతుంది.

5 / 6
కావున ఉదయాన్నే రాగి జావ తాగితే.. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. వేడి నీటిలో రాగి పిండి కలిపి జావలా చేసుకోని తాగాలి. రుచి కోసం కొంచెం మజ్జిగ, బెల్లం లాంటివి కలుపుకోవచ్చు.

6 / 6
Follow us