Healthy Breakfast : ఓట్స్ తో ఇడ్లి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మరి ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఏమిటంటే…!

Healthy Breakfast : రోజు రోజుకీ మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. తినే తిండి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వు, చేరని ఆహారపదార్ధాలు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆదరణ సొంతం చేసుకుంది ఓట్స్....

Healthy Breakfast : ఓట్స్ తో ఇడ్లి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మరి ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఏమిటంటే...!
Oats Idli
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2021 | 3:21 PM

Healthy Breakfast: రోజు రోజుకీ మనిషికి ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. తినే తిండి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొవ్వు, చేరని ఆహారపదార్ధాలు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆదరణ సొంతం చేసుకుంది ఓట్స్. ఇవి మన దేశానికి చెందిన పంట కాదు. అయినా మన దేశంలో వీటికి మంచి ఆదరణ ఉంది. దీనికి కారణం ఇందులో ఉన్న పోషక విలువలు పైగా తయారు చేసుకోవడం సులభం. ఓట్స్ సులభంగా జీర్ణం అవుతాయి. కొవ్వును కరిగిస్తుంది.. బరువు తగ్గిస్తుంది. అందుకనే ప్రస్తుతం ఓట్స్ భారతీయులు తినే ఆహారపదార్ధాల్లో ఒకటిగా చేరిపోయింది. ఈరోజు ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ రెసిపీ తెలుసుకుందాం..!

కావలసిన పదార్ధాలు:

రోల్డ్ ఓట్స్ లేదా ఇనిస్టెంట్ ఓట్స్ – 1 కప్పు చిలికిన పెరుగు కావాల్సినంత నూనె – 1 టేబుల్ స్పూన్ శనగపప్పు – 1 టీ స్పూన్ మినప్పప్పు – 1 టీ స్పూన్ జీలకర్ర – 1 టీ స్పూన్ ఆవాలు – 1 / 2 టీ స్పూన్ ఉల్లిపాయ – 1 (చిన్నగా తరిగినది) పచ్చిమిరపకాయలు – 2 (తరిగినవి) అల్లం ముక్క – 1 (తరిగినది) క్యారెట్ – 1 (తురిమినది) కరివేపాకులు తరిగిన కొత్తిమీర ఉప్పు రుచికి సరిపడా నీరు

తయారీ విధానం

ముందుగా ఓట్స్ ను మిక్సీలో బరకగా పొడి పట్టుకోవాలి.. తర్వాత దానిని ఒక పెద్ద బౌల్ లోకి తీసుకోవాలి. కొంచెం రోల్డ్ ఓట్స్ ను వేసుకోవాలి. ఇంతలో గ్యాస్ స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వేసి వేయించాలి. కొంచెం సేపు వేయించిన తర్వాత.. స్టౌ మీద నుంచి దించేయాలి. తర్వాత వాటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఓట్స్ పొడి లో వీటిని వేయాలి.. దానిలో క్యారట్ తురుము, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత చిలికిన పెరుగుని వేసి ఇడ్లి మిక్స్ రెడీ చేసుకోవాలి. ఉప్పు చూసి… ఐదు నిముషాలు పక్కన పెట్టుకోవాలి. ఇడ్లి స్టాండ్ లో ఆ పిండి ని ఇడ్లి లా వేసుకుని గ్యాస్ స్టౌ మీద పెట్టి ఉడికించాలి. అయితే ఈ ఇడ్లిని విజిల్ లేకుండా ఆవిరి మీద ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి ఇన్స్టెంట్ ఇడ్లీ రెడీ.. నచ్చిన చెట్నీతో తింటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం

Also Read:  టెన్త్ క్వాలిఫికేషన్ తో కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగవకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!

Ghost Builts Shiva Temple: ఒక్క రాత్రిలో శివునికి ఆలయం .. దెయ్యాల పనే అంటున్న స్థానికులు.. ఎక్కడ ఉందో తెలుసా..!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!