Butter Coffee: ఎప్పుడైనా వెన్న తో తయారు చేసిన కాఫీని తాగారా.. బటర్ కాఫీ రెసిపీ వీడియో వైరల్..
Butter Coffee: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు .. అవును అందరి ఆలోచనలు ఒకలా ఉండవు.. అలాగే అందరూ ఒకే రకమైన ఆహారాన్ని తినలేరు. అలాగే కాఫీ కూడా ఎవరి టేస్టు బట్టి వారు తాగుతారు.. కొందరు వేడివేడిగా కాఫీ కావాలంటే.
Butter Coffee: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు .. అవును అందరి ఆలోచనలు ఒకలా ఉండవు.. అలాగే అందరూ ఒకే రకమైన ఆహారాన్ని తినలేరు. అలాగే కాఫీ కూడా ఎవరి టేస్టు బట్టి వారు తాగుతారు.. కొందరు వేడివేడిగా కాఫీ కావాలంటే. మరికొందరు కోల్డ్ కాఫీ అంటారు.. ఇంకొందరు ఐస్ కాఫీ.. కొరితే .. చాలా మంది చిక్కటి పాలుతో కాఫీ తాగడానికి ఇష్టపడతారు.. కానీ ఎవరైనా కాఫీ కి అదనపు హంగులను చేకూర్చుతూ.. వెన్నతో కాఫీ ని ఎప్పుడైనా ప్రయత్నించారా.. పోనీ అసలు వెన్నతో కాఫీ తయారు చేస్తారు అని తెలుసా..! కానీ వెన్నతో కాఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..
దేశ రాజధాని ఢిల్లీలోని జామా మసీదు సమీపంలో ఒక టీ స్టాల్ ఉంది. ఆ స్టాల్ యజమాని బటర్ కాఫీ, బటర్ టీ వంటి ప్రత్యేకమైన పానీయాలను విక్రయిస్తాడు. తాజాగా బట్టర్ కాఫీ తయారిని చూపించాడు. ముందుగా ఓ గిన్నెలో పాలు తీసుకున్నాడు.. తర్వాత అందులకో అమూల్ వెన్నెని కలిపాడు.. తర్వాత బ్రూ కాఫీ పౌడర్, చక్కర వేసి స్టీమ్ చేశాడు.. అనంతరం ఓ కప్ లో కాఫీని వేసి.. దానిపై కోకో పౌడర్ వేశాడు.. దీంతో బటర్ కాఫీ తాగడానికి రెడీ అయ్యింది. ఈ కాఫీ స్టాల్ ను 20 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నట్లు యజమాని తెలిపాడు.. ఒక కప్ ఖరీదు రూ. 30.
ఈ కాఫీ మరీ తీపిగా లేదు.. అలాగని చేదుగా కూడాలేదని .. డిఫరెంట్ టేస్టు కావాలనుకునేవారికి మంచి చాయిస్ ఈ బటర్ కాఫీ అని చెప్పాడు. మరి మీరు కూడా బటర్ కాఫీ తయారీ పై ఓ లుక్ వేయండి.
View this post on Instagram
Also Read: April Fools’ Day 2021: సరదాగా జరుపుకునే ఏప్రిల్ పూల్స్ డే .. ఎప్పుడు.. ఎక్కడ ఎలా మొదలైందో తెలుసా..?