New Wage Code Deferred: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త వేతన చట్టం తాత్కాలికంగా నిలిపివేత.. యధావిధిగా శాలరీ అందజేత
New Wage Code Deferred: భారతదేశ కొత్త వేతన నియమాలు రేపు అమల్లోకి రావడం లేదు. చాలా మంది ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జీతాల స్ట్రక్చర్ నే అమలు చేయనున్నామని.. రేపటి నుంచి అమలు చేయాలనుకుంటున్న..
New Wage Code Deferred: భారతదేశ కొత్త వేతన నియమాలు రేపు అమల్లోకి రావడం లేదు. చాలా మంది ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జీతాల స్ట్రక్చర్ నే అమలు చేయనున్నామని.. రేపటి నుంచి అమలు చేయాలనుకుంటున్న శాలరీ స్ట్రక్చర్ ను మార్చే కొత్త వేతన కోడ్ వాయిదా వేశామని కార్మిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి చెప్పారు
ఈ కొత్త వేతన కోడ్ అమలు వాయిదా వేయడంతో పలు పరిశ్రమ నిపుణులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కొత్త చట్టం అమలు చేయడం కోసం వేలాది కంపీనీ తమ ఉద్యోగుల కోసం కొత్త పరిహార నిర్మాణాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్తవేతనా చట్టం వాయిదా వేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని పలువురు నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి కేంద్ర ప్రభుత్వం 2020 లోనే కొత్త వేతన కోడ్ చట్టానికి ఆమోదం తెలిపింది. దీనిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలనీ భావించింది. దీంతో ఉద్యోగులు, సంస్థలూ రెండిటిలో కొత్త బిల్లులతో పలు మార్పులు చోటు చేసుకోవాల్సి ఉంది.
*మూల వేతనం మొత్తం వేతనంలో 50% ఉండాలని, అలవెన్సులు 50% కంటే ఎక్కువ ఉండకూదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వేతనంలో పేర్కొనే, మూల వేతనం, అలవెన్సుల కేటాయింపులో మార్పులు .. . గ్రాట్యూటీ, పీఎఫ్పెపంకం వంటి అనేక మార్పులు జరగాల్సి ఉంది. అప్పుడు ఉద్యోగులకు అందే నికర వేతనం తగ్గాల్సి ఉంది.. అయితే, తాజా మార్పులతో రిటైర్మెంట్ సమయానికి పీఎఫ్, గ్రాట్యూటీ సొమ్ము మరింత పెరుగును.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన చట్టం అమలుకు వెనకడుగు వేయడంతో.. ఉద్యోగులకు యధావిధిగా జీతాలు గతంలో మాదిరిగానే అందుకోనున్నారు.
Also Read: ఓట్స్ తో ఇడ్లి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. మరి ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఏమిటంటే…!