Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించిన కేంద్రం

Rajinikanth: భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం..

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించిన కేంద్రం
Rajinikanth
Follow us
Surya Kala

|

Updated on: Apr 01, 2021 | 10:34 AM

Rajinikanth :భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారాన్ని 2020 సంవత్సరానికిగాను సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే జన్మ శతి సందర్భంగా 1963లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే జాతీయ సినిమా అవార్డుల తోపాటు ఇస్తారు. తాజాగా ఈ అవార్డ్ ను రజని కాంత్ అందుకోనున్నారు .

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ రజనీకాంత్ కు ఇవ్వాలని జ్యురీ నిర్ణయించింది. కేంద్రం ఆమోదించింది. రజనికాంత్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను ఇస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రకటించారు.

రజనీకాంత్ ఈ అవార్డు పొందిన 12 వ దక్షిణ భారతీయుడు. డాక్టర్ రాజ్‌కుమార్, అక్కినేని నాగేశ్వర్ రావు, కె బాలచందర్ వంటి దిగ్గజాలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను  అందుకున్నారు. 

అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వెయ్యాలని భావిస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ కు ఇప్పుడు దాదాసాహెచ్ ఫాల్కే అవార్డు ను ప్రకటించడం .. ఎలక్షన్ స్టంట్ అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇక మరికొందరు ఇది తమిళనాడుకు కేంద్రం ఎలక్షన్ ఆఫర్ అని.. రజని కాంత్ పార్టీ పెట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నందుకు గిఫ్ట్ అని అంటున్నారు. అంతేకాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో రజని ఫ్యాన్స్ ఓట్ల కోసం అని మరికొందరు ఘాటుగా విమర్శలు సంధిస్తున్నారు.

రజనీకాంత్ ఓ సాధారణ ఉద్యోగి.. సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు దేశంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు . తన విలక్షణ నటనతో దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ 160 సినిమాలకు పైగా నటించారు.. 2016లో అప్పటి దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మవిభూషణ్ పురస్కారం సూపర్ స్టార్ రజినీకాంత్ అందుకున్నారు.

Also Read:  మీతో మాట్లాడను మీరు మీ అమ్మనే ఎంచుకున్నారు.. నన్ను కాదన్న కార్తీక్..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.