AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Easy Tomato Pickle: ఈజీగా ఒక్క గంటలో చేసుకునే రుచికరమైన టమాటా ఊరగాయ తయారీ విధానం

Easy Tomato Pickle:వేసవి వస్తే.. పచ్చళ్ళ సందడి మొదలవుతుంది. ఇక టమాటాల సీజన్ కనుక.. ఎక్కువగా మార్కెట్లో దొరుకుతాయి. అయితే వీటితో ఏడాది పాటు..

Easy Tomato Pickle: ఈజీగా ఒక్క గంటలో చేసుకునే రుచికరమైన టమాటా ఊరగాయ తయారీ విధానం
Tomato Pickle
Surya Kala
|

Updated on: Apr 01, 2021 | 2:06 PM

Share

Easy Tomato Pickle: వేసవి వస్తే.. పచ్చళ్ళ సందడి మొదలవుతుంది. ఇక టమాటాల సీజన్ కనుక.. ఎక్కువగా మార్కెట్లో దొరుకుతాయి. అయితే వీటితో ఏడాది పాటు నిల్వ పచ్చడి పెట్టుకుంటారు. దీనికి కొంచెం ప్రోసెస్ ఎక్కువ సమయం తీసుకుంటుంది. అయితే అంతే రుచినిచ్చే విధంగా ఈజీగా టమాటా పికిల్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం “టమాటా టెంపరరీ” ఊరగాయ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు గురించి తెలుసుకుందాం…. ఈ ఊరగాయ చేసుకోవడం చాలా తేలిక. ఎండబెట్టక్కర లేదు. అప్పటికప్పుడు చేసుకొని వెంటనే లాగించేయొచ్చు.

కావలసిన పదార్దములు:

సగం పండిన టమోటాలు కారం ఉప్పు మెంతిపిండి మంచినూనె ఇంగువ రెండు స్పూన్లు ఉడికించిన చింతపండు గుజ్జు పోపు సామాను

తయారీ విధానం:

ముందుగా మంచినూనెతో పోపు వేసుకుని ( మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి ముక్కలు, కొంచెం పసుపు )ప్రక్కన పెట్టాలి. తర్వాత పొడిగా ఉన్న టొమాటోలను ముక్కలుగా తరిగి నూనెలో “మూత పెట్టకుండా” మగ్గబెట్టాలి. మెంతిపిండి 1 పావుకప్పు కన్నా తక్కువ, కారం 1 కప్పున్నర, ఉప్పు అరకప్పు బాగా కలుపుకోవాలి. తరువాత టమాటాలు చల్లారాక ఈ మిశ్రమాన్ని, పోపును, చింతపండు గుజ్జును వేయించిన టమోటాల్లో కలుపుకోవాలి. నూనె చాలకపోతే కొంచెం నూనెను ఇంగువ తో కాచి, చల్లార్చి కలుపుకోవాలి. అంతే టమాటా పచ్చడి రెడీ.

ఈ ఊరగాయ ఇడ్లీ, దోసె వగైరా అన్ని టిఫిన్స్ లోకి.. ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి పోసుకుని తింటే అద్భుతః. ఈ పచ్చడి సుమారు 10 పదిహేను రోజున నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ లో అయితే ఒక నెల రోజులు ఉంటుంది.

Also Read: ఉచిత పథకాలతో ప్రజలను సోమరులుగా తయారుచేస్తున్నారంటూ రాజకీయ పార్టీలపై మండిపడిన హైకోర్టు

Viral Video: అమ్మ ప్రేమకు మరో సాక్ష్యం.. తన పిల్లల క్షేమం కోసం తల్లి ఎలుగు తపన.. నెటిజన్లు ఫిదా..!