Viral Video: అమ్మ ప్రేమకు మరో సాక్ష్యం.. తన పిల్లల క్షేమం కోసం తల్లి ఎలుగు తపన.. నెటిజన్లు ఫిదా..!

Viral Video:సృష్టిలో తియ్యనిది అమ్మప్రేమ.. అమ్మ తన పిల్లల క్షేమం కోసం తన సుఖసంతోషాలను సైతం తృణప్రాయంగా వదిలేస్తుంది. అమ్మ ప్రేమకు జంతువులు..

Viral Video: అమ్మ ప్రేమకు మరో సాక్ష్యం.. తన పిల్లల క్షేమం కోసం తల్లి ఎలుగు తపన.. నెటిజన్లు ఫిదా..!
Mother Bears Love
Follow us

|

Updated on: Apr 01, 2021 | 12:02 PM

Viral Video:సృష్టిలో తియ్యనిది అమ్మప్రేమ.. అమ్మ తన పిల్లల క్షేమం కోసం తన సుఖసంతోషాలను సైతం తృణప్రాయంగా వదిలేస్తుంది. అమ్మ ప్రేమకు జంతువులు కూడా అతీతం కాదు.. తమ పిల్లల కోసం.. వాటిని కాపాడుకోవడం కోసం తమ ప్రాణాలను సైతం అడ్డేసిన ఎన్నో సంఘటనలు చూస్తున్నాం.. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఎలుగుబంటి తన పిల్లలను క్షేమంగా రోడ్డు దాటించడానికి పడుతున్న తపన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. రద్దీగా ఉన్న రోడ్డు మీద నుంచి తన పిల్లలను జాగ్రత్తగా తీసుకెళ్లడానికి భల్లూకం చూపిన ప్రేమకు అక్కడ ఉన్న వాహనదారులు ఫిదా అయ్యారు. యుకే జరిగిన ఈ సంఘటన అక్కడి పోలీసులు పోలీసులు తమ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేశారు.

భల్లూకం తన నలుగురు పిల్లలని క్షేమంగా రోడ్డు దాటించడానికి తన తెలివిని చూపించింది. మొదట ఒక పిల్లని నోటకరుచుకుని తీసుకుని వెళ్తుంటే.. తల్లి వెనుక మరో పిల్లల రోడ్డు దాటింది. అలా ఎలుగు బంటి రోడ్డు దాటున్న సమయంలో రోడ్డుమీద వాహనాలు నిలిచి ఉన్నాయి. మొదట ఓ పిల్ల ఎలుగు బంటిని క్షేమంగా దాటించింది. తర్వాత మిగిలిన రెండు పిల్లల కోసం వచ్చింది. వాటిల్లో ఒకదానిని మళ్ళీ నోట కరుచుకుని మరొకదానిని తనతో పాటు రమ్మనమని సైగ చేస్తూ.. జాగ్రత్తగా రోడ్డు దాటించింది. ఇలా తల్లి భల్లూకం రోడ్డు దాటుతుంటే ఒక పిల్ల ఎలుగుబంటి.. చెంగు చెంగున గంతుతో రోడ్డు మీద సందడి చేసింది.

తల్లి ఎలుగు తన పిల్లలను రక్షించడానికి పడిన తపన కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తల్లి ప్రేమ ఎవరిదైనా ఒకటే కదా అంటున్నారు. ముఖ్యంగా ఆ ఎలుగు బంటి తన పిల్లలని రోడ్డు దాటించే వరకూ ఎదురుచూసిన వాహనదారుల ఓపికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక భల్లూకం కోసం అంతసేపు వాహనాలను ఆపిన పోలీసులును మెచ్చుకుంటున్నారు మరికొందరు. ఏది ఏమైనా అమ్మప్రేమను మించి రక్షణ పిల్లలకు ఎక్కడా దొరకదు అని మళ్ళీ రుజువైంది అంటున్నారు నెటిజన్లు.

Also Read: షుగర్‌కు చెక్ పెట్టాలనుకుంటున్నారా.. బొజ్జను తగ్గించాలనుకుంటున్నారా.. ఈ ఆసనం ట్రై చేస్తే సరి