Padahastasana: షుగర్‌కు చెక్ పెట్టాలనుకుంటున్నారా.. బొజ్జను తగ్గించాలనుకుంటున్నారా.. ఈ ఆసనం ట్రై చేస్తే సరి
కరోనా వైరస్ నియంత్రించడానికి చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఎట్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. దీంతో చాలా మందికి...
Padahastasana:కరోనా వైరస్ నియంత్రించడానికి చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఎట్ హోమ్ సదుపాయాన్ని కల్పించాయి. దీంతో చాలా మందికి శారీరక శ్రమ లేకుండా పోయింది. తినడం.. ఇంట్లోనే కూర్చుని గంటల తరబడి పని చేయడం దీంతో పొట్ట పెరుగుతుంది. ఇక ప్రస్తుతం వయసుతో సంబంధంలేకుండా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బొజ్జ తగ్గాలన్నా.. షుగర్ నియంత్రణలో ఉండాలన్నా చిన్నపాటి వ్యాయామం తప్పని సరి.. ముఖ్యంగా పొట్టతగ్గడంతో పాటు మధుమేహాన్ని నియంత్రించేందుకు యోగాలో మంచి ఆసనం ఉంది. అదే పాద హస్తాసనం. ఇది యోగాసనాల్లో ఒకటి. ఈ ఆసనం లో చేతులతో పాదములను అందుకుంటారు. అందుకనే దీనిని పాదహస్తాసనం అని పిలుస్తారు.
ఆసనం వేయు పద్దతి:
1. ముందుగా నిటారుగా నిలబడాలి. 2. తర్వాత మెల్లగా చేతులను నిటారుగా పైకి తీసుకురావాలి. 3. శరీరం ను మెల్లగా పైకి సాగదీసి హిప్ ను ముందుకు వంచాలి. ఇప్పుడు అర్ధ చంద్రాకారంలో కనిపిస్తాం. 4 అర్ధ చంద్రాసనం నుంచి శ్వాస వదులుతూ ముందుకి వంగి చేతులతో పాదాలను తాకాలి. 5తలను మోకాలికి ఆన్చుకోవాలి. 6ఇలా కొద్ది క్షణాలు ఉన్న తరువాత మెల్లగా యధా స్థితికి రావాలి. 7. ఇలా ఈ ఆసనాన్ని రోజు పది నుంచి పదిహేను నిమిషాలు చేయాలి.
ఈ ఆసనం ఉపయోగాలు
ఉదర భాగంలోని గ్రంధులను ఉతేజపరుస్తుంది. అజీర్ణము , ఫైల్స్, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. వెన్నుముఖకు శక్తినిస్తుంది. . రక్త ప్రసరణ ను వృద్ధి చేస్తుంది. వీపు, నడుము కండరాలకు శక్తినిస్తుంది.
Also Read: వేసవిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే స్నాక్స్ ఏమిటంటే..!