ఉచిత పథకాలతో ప్రజలను సోమరులుగా తయారుచేస్తున్నారంటూ రాజకీయ పార్టీలపై మండిపడిన హైకోర్టు
Freebies Have Made People Lazy: తమిళనాడులో ప్రీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలపై వారి ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పధకాల..
Freebies Have Made People Lazy: తమిళనాడులో ప్రీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలపై వారి ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పధకాల ద్వారా ప్రజలను మరింత సోమరిపోతులుగా మారుస్తున్నరంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ ఉచిత హామీలకు అలవాటు పడిన స్థానికులు పనిచేయడానికి నిరాకరిస్తున్నారని.. దీంతో వలస కార్మికులు ఉద్యోగాలు చేపడుతున్నారంటూ కోర్టు వ్యాఖ్యానించించింది. అంతేకాదు వలస కార్మికులు త్వరలోనే ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేసి యజమానులు అయినా ఆశ్చర్యపోనవసరం లేదని . అప్పుడు స్థానికులు వారికింద పనివారుగా మారతారంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
అందుకని రాజకీయ నేతలు ఉచిత హామీలను ప్రకటించడం కంటే.. ఉద్యోగాల సృష్టి, ఆరోగ్యం, రవాణా, మౌలిక సదుపాయాల కల్పన పై రాజకీయ పార్టీల ద్రుష్టి పెట్టాలని సూచించింది. ఉచిత పధకాల వల్ల ఏ పని చేయకపోయినా , ఎలాగైనా బ్రతికేయచ్చు అని ప్రజలు భావిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఇక అధికారంలోకి వచ్చేందుకు ప్రకటించిన హామీలను నెరవేర్చని పార్టీల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
Also Read: ఈ అవార్డుకు నూరు శాతం అర్హుడంటూ.. శుభాకాంక్షలు వెల్లువ.. ప్రధాని మోడీ, చిరు, కమల్,