Nagarjuna Akkineni: ఆ మెగా హీరోతో సినిమా చేయబోతున్నా.. క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగార్జున..

కింగ్ నాగార్జున నటిస్తున్న 'వైల్డ్ డాగ్' సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాకు అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగార్జున ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా పాత్ర‌ను

Nagarjuna Akkineni: ఆ మెగా హీరోతో సినిమా చేయబోతున్నా.. క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగార్జున..
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 01, 2021 | 5:11 PM

Nagarjuna : కింగ్ నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.  అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగార్జున ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా పాత్ర‌ను చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వ‌ల్ల సినిమాలో ఆయ‌న‌ను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారట. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బంధం. ట్రైలర్ సినిమా పైన ఆసక్తిని పెంచేసింది.

నాగార్జున అటు హీరోగానే కాకుండా ఇటు నిర్మాతగానూ రాణించాలని చూస్తున్నారు. ఉప్పెన సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో నాగార్జున ఒక సినిమా చేస్తున్నాడు. అన్నపూర్ణ బ్యానర్ పైన నాగార్జున వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నారంటూ గతంలో వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా ఆ వార్తలకు నాగార్జున క్లారిటీ ఇచ్చారు. వైల్డ్ డాగ్  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ..తాను మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు కింగ్. కాగా.. ఇప్పటికే వైష్ణవ్ తేజ్ వద్దకు స్క్రిప్టు వెళ్లిందని తెలుస్తుంది. స్క్రిప్టు విన్న మెగాహీరో  సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఇక డెబ్యూ సినిమాతోనే సంచలన  విజయాన్ని అందుకున్నాడు వైష్ణవ్. అంతే కాదు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతోపాటు వసూళ్లపరంగాను దూసుకుపోయింది. 100కోట్ల మార్క్ ను ఈ సినిమా అవలీలగా దాటింది. ఇప్పుడు నాగ్ నిర్మిస్తున్న వైష్ణవ్ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే.. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు టేకప్ చేయనున్నట్టు నాగార్జున ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు నాగ్ .

మరిన్ని ఇక్కడ చదవండి :

ఒక మూవీ షూటింగ్… మరో సినిమా పూజా కార్యక్రమాలు.. చాలా బాధగా ఉంది.. పూజా హెగ్డే..

Karthi Sulthan Movie: కార్తీ సుల్తాన్ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!