ఒక మూవీ షూటింగ్… మరో సినిమా పూజా కార్యక్రమాలు.. చాలా బాధగా ఉంది.. పూజా హెగ్డే..

Pooja Hegde: అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే. ఇక ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో

ఒక మూవీ షూటింగ్... మరో సినిమా పూజా కార్యక్రమాలు.. చాలా బాధగా ఉంది.. పూజా హెగ్డే..
Pooja Hegde

Pooja Hegde: అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‏గా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజాహెగ్డే. ఇక ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది పూజా. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‏గా మారిపోయింది. పాన్ స్టార్ ప్రభాస్‏కు జోడీగా రాధేశ్యామ్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అటు ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకొని.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాకుండా.. మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో చరణ్ సరసన ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇవే కాకుండా.. అక్కినేని అఖిల్ సరసన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటు తెలుగులోనే కాకుండా.. హిందీలోనూ వరుస ఆఫర్లను అందుకుంటుంది ఈ బ్యూటీ. ఇక ఇవే కాకుండా.. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో.. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసింది.

తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం చెన్నైలో జరిగింది. అయితే పూజా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు హాజరుకాలేకపోయింది. దీంతో తన మనసులోని మాటలను బయటపెట్టింది. విజయ్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో నేను పాల్గోనలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. నేను మరొక లొకేషన్‏లో షూటింగ్ ఉండడం వలన అక్కడకు వెళ్ళలేకపోయాను. కానీ నా మనసు ఇప్పుడు ఆ చిత్రయూనిట్‏తోనే ఉంది.. ఈ సినిమా షూటింగ్‏లో జాయిన్ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకోచ్చింది. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ఇదే నెలలో ప్రారంభంకానుంది. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాతా పూజా ఈ సినిమాతో తమిళ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: ఇప్పటికే నాకు మూడు, నాలుగుసార్లు పెళ్లి చేసారు… ఆసక్తికర విషయాలను చెప్పిన కీర్తి సురేష్..

రామ్ చరణ్, శంకర్ సినిమాకు షాక్.. సినిమా ఆపేయాలంటూ కోర్డులో కేసు.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు..