AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Adipurush: ముందు జాగ్రత్త పడుతోన్న ‘ఆదిపురుష్’.. షూటింగ్ స్పాట్‌లో కేవలం..

Prabhas Adipurush Shooting: కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువగా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఏటా కోట్ల రూపాయల టర్నోవర్ చేసే సినిమా ఇండస్ట్రీ కరోనా కారణంగా వెలవెలబోయింది...

Prabhas Adipurush: ముందు జాగ్రత్త పడుతోన్న ‘ఆదిపురుష్’.. షూటింగ్ స్పాట్‌లో కేవలం..
Adipurush Shooting
Narender Vaitla
|

Updated on: Apr 01, 2021 | 4:44 PM

Share

Prabhas Adipurush Shooting: కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువగా నష్టపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. ఏటా కోట్ల రూపాయల టర్నోవర్ చేసే సినిమా ఇండస్ట్రీ కరోనా కారణంగా వెలవెలబోయింది. సినిమాలు లేక ఓవైపు థియేటర్లు మూతపడితే మరోవైపు నటీనటులు ఖాళీగా ఉండే పరస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా చిన్నా చితక నటీనటులపై ఇది తీవ్రమైన ప్రభావం చూపించింది. ఇక తాజాగా వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం, థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో పరిస్థితులు మెరుగవుతున్నాయన్ని అంతా అనుకున్నారు. అయితే ఇదే సమయంలో సెకండ్ వేవ్‌తో మళ్లీ వైరస్ కలకలం రేపుతోంది. ఇదిలా ఉంటే సినిమా చిత్రీకరణలపై కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా దెబ్బ తమకు తగలకూడదనే ఉద్దేశంతో ఆదిపురుష్ టీమ్ ముందు జాగ్రత్త పడుతోంది. కరోనా తమ టీమ్ వరకు రాకుండా షూటింగ్ స్పాట్‌లో కేవలం 25 మంది మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ విషయమై చిత్ర దర్శకుడు ఓంరౌత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం. ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే షూటింగ్ పూర్తికాగానే సెట్ మొత్తాన్ని శానిటైజ్ చేస్తూ షూటింగ్‌ను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆదిపురుష్ సెకండ్ షెడ్యూల్ కొనసాగుతోంది. ఈ షూటింగ్ వచ్చే నెల రెండో వారం వరకూ కొనసాగుతుంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాలో కృతీ సనన్ సీత పాత్రలో నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నారు.

Also Read: Nagarjuna Akkineni: ఆ మెగా హీరోతో సినిమా చేయబోతున్నా.. క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగార్జున..

నన్ను కాస్త మాట్లాడనివ్వండి.. నాకు లేట్ అవుతుంది.. నేను వెళ్లాలి.. ఫ్యాన్స్ ముందు మొరపెట్టుకున్న రష్మిక..

ఒక మూవీ షూటింగ్… మరో సినిమా పూజా కార్యక్రమాలు.. చాలా బాధగా ఉంది.. పూజా హెగ్డే..