AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acharya Movie: అమేజింగ్ రెస్పాన్స్ తో అదరగొడుతున్న ఆచార్య సాంగ్.. 5 మిలియన్ మార్క్ ను దాటిన పాట

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న భారీ చిత్రం `ఆచార్య‌`. బుధ‌వారం ఈ సినిమాలో `లాహే లాహే...` అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

Acharya Movie: అమేజింగ్ రెస్పాన్స్ తో అదరగొడుతున్న ఆచార్య సాంగ్.. 5 మిలియన్ మార్క్ ను దాటిన పాట
Megastar
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2021 | 5:47 PM

Share

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తోన్న భారీ చిత్రం `ఆచార్య‌`. బుధ‌వారం ఈ సినిమాలో `లాహే లాహే…` అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

హైద‌రాబాద్ శివారు ప్రాంతం కోకాపేట‌లో వేసిన టెంపుల్ సెట్‌లో ఈ `లాహే లాహే..` సాంగ్‌ను చిత్రీక‌రించారు. ప‌ర‌మేశ్వ‌రుడిని స్తుతిస్తూ ఈ పాట‌ను పిక్చ‌రైజ్ చేశారు, అందుకు త‌గిన‌ట్లు ప్ర‌ముఖ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి అద్భుత‌మైన లిరిక్స్‌ను అందించారు. ప‌ర‌మేశ్వ‌రుడి రూపాన్ని త‌న పాట‌తో పొగుడుతూ దాన్ని మెగాస్టార్ చిరంజీవికి మ్యాచ్ అయ్యేలా రాయ‌డం రామ‌జోగ‌య్య శాస్త్రికే చెల్లుతుంది అనేలా పాట‌ను అందంగా రాశారు.

మెగాస్టార్ డాన్స్‌కు ఉండే క్రేజే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి క‌ష్ట‌మైన స్టెప్‌నైనా అల‌వోక‌గానే కాదు.. అందంగానూ వేసే మెగాస్టార్ ఈ సినిమాలో త‌న‌దైన డాన్సింగ్ చ‌మ‌క్కులు చూపించ‌డం ఖాయ‌మ‌ని చెప్పేలా ఈ లిరిక‌ల్ సాంగ్‌లో చిన్న డాన్స్ బీట్ ఉంటుంది. ఈ పాట‌లో కాజ‌ల్‌, న‌టి సంగీత కూడా ఉండ‌టం కొస‌మెరుపు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలోని ఈ పాట‌ను హారిక నారాయ‌ణ్‌, సాహితీ ఆల‌పించారు. ఫోక్ సాంగ్‌.. సెమీ క్లాసిక్ ఫార్మేట్‌లో ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట‌కు ప్రేక్ష‌కాభిమానుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఇప్పటికే ఈ పాట 5 మిలియన్ మార్క్ ను దాటేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. మే 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Celeb birthdays in April: అల్లు అర్జున్, సమంత‏తోపాటు ఏప్రిల్‏లో పుట్టిన రోజులు జరుపుకోనున్న స్టార్స్ వీళ్లే..

Prabhas Adipurush: ముందు జాగ్రత్త పడుతోన్న ‘ఆదిపురుష్’.. షూటింగ్ స్పాట్‌లో కేవలం..

RRR Movie Update: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో వింటే అదిరిపోతారు!

Follow Us
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే