Ram Charan: రామ్ చరణ్‌కి ఇష్టమైన నాలుగు సినిమాలు ఏంటో తెలుసా ?.. తెలుగులో ఏ చిత్రమంటే..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్.. తాను టీనేజ్‌లో ఉన్న సమయంలో జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా-జోన్స్ అంటే క్రష్ అనే విషాయలను వెల్లడించాడు. ఇక ఇప్పుడు తనకు నచ్చిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. గతవారం వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్నారు చెర్రీ. అక్కడి స్థానిక మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు చరణ్. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే చెర్రీ.. తన వ్యక్తిగత అభిరుచుల గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్.. తాను టీనేజ్‌లో ఉన్న సమయంలో జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా-జోన్స్ అంటే క్రష్ అనే విషాయలను వెల్లడించాడు. ఇక ఇప్పుడు తనకు నచ్చిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
చరణ్ మాట్లాడుతూ.. ” నాకు నచ్చిన చిత్రాల్లో ‘ది నోట్‌బుక్’ ఒకటి. ఆ తర్వాత ‘టెర్మినేటర్ 2’. ఈ సినిమాను నేను ఎల్‌ఈడీ డిక్స్‌లో యాభై సార్లు చూసాను. అది నాకు చాలా నచ్చింది. అలాగే ‘గ్లాడియేటర్’, అన్ని టరాన్టినో సినిమాలు కూడా చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టమైన వాటిలో ‘ది ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్’ మరింత ఫేవరేట్” అని చెప్పారు.
అలాగే “తెలుగులో “దాన వీర శూర కర్ణ’, ‘బాహుబలి’ , నేను నటించిన’రంగస్థలం’ సౌత్ ఇండస్ట్రీలోని అనేక క్లాసిక్ సినిమాలు.. నా ఆల్ టైమ్ ఫేవరేట్ జాబితాలో ఉంటాయి. ఇక డైరెక్టర్ శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ‘మిస్టర్ ఇండియా’ కూడా నా ఫేవరేట్ చిత్రాల్లో ఒకటి” అంటూ చెప్పుకొచ్చారు చరణ్. ప్రస్తుతం చెర్రీతోపాటు.. డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం అమెరికా పర్యటనలో ఉన్నారు. చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విశ్వవేదికపై ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 95వ అకాడమీ అవార్డ్స్ కోసం పోటి పడుతుంది ఈ చిత్రం.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
