AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: జక్కన్న క్రేజ్ మాములుగా లేదుగా.. అక్కడ ఆర్ఆర్ఆర్ రీరిలీజ్.. మరోసారి హౌస్‏ఫుల్ బోర్డ్స్‏తో రచ్చ..

తాజాగా ఆస్కార్ అవార్డ్ ప్రధానోత్సవానికి ముందు అమెరికాలో మరోసారి ట్రిపుల్ ఆర్ రీరిలీజ్ అవుతుంది.

RRR Movie: జక్కన్న క్రేజ్ మాములుగా లేదుగా.. అక్కడ ఆర్ఆర్ఆర్ రీరిలీజ్.. మరోసారి హౌస్‏ఫుల్ బోర్డ్స్‏తో రచ్చ..
Rrr
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2023 | 4:32 PM

Share

డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్స్ వర్షం కురిపించింది. జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమాకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ మాత్రమే కాకుండా.. ఇటీవల హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆస్కార్ 2023 అవార్డ్ కోసం పోటీపడుతుంది. ఇందులో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ట్రిపుల్ ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డ్ ప్రధానోత్సవానికి ముందు అమెరికాలో మరోసారి ట్రిపుల్ ఆర్ రీరిలీజ్ అవుతుంది.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‏లోని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 1600 కంటే ఎక్కువ టికెట్స్ సేల్ అయ్యి స్క్రీనింగ్ హౌస్ ఫుల్ బోర్ట్ కనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచ దేశాల్లో మాత్రం సత్తా చాటుతుంది.

ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ అమెరికాలో అనేక అవార్డ్స్ సొంతం చేసుకుంది. BAFTA 2023 లాంగ్ లిస్ట్ లో ఇంగ్లీష్ లాంగ్వెజ్ లో కాకుండా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్స్ గెలుచుకుంది. అలాగే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ వేడుకలలో 28వ ఎడిషన్ లో ఉత్తమ పాటగా నిలిచింది. 95వ అకాడమీ అవార్డ్స్ ప్రధానోత్సవానికి ముందు లాస్ ఏంజిల్స్ లోని థియేటర్లలో ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే మరోసారి భారీగా టికెట్స్ సేల్ అవుతూ హౌస్ ఫుల్ అవుతున్న విషయాన్ని మేకర్స్ ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!