Pawan Kalyan: ‘ఆహ్వానించారు.. కానీ రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను’.. పవన్ కళ్యాణ్ స్పెషల్ నోట్..
పొలిటికల్ మీటింగ్స్ ఉండడం వల్ల మీ వేడుకకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.

కబ్జ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి తనను అతిథిగా అహ్వానిస్తే.. రాలేకపోయినందుకు చింతిస్తున్నాను అన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. “కబ్జ సినిమా హీరో ఉపేంద్ర, సుదీప్ లకు నా హృదయపూర్వక అభినందనలు. వాళ్లిద్దరితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. ఉపేంద్ర, సుదీప్ ఇద్దరూ విభిన్నమైన పాత్రలలో నటించారు. ఈ సినిమా కన్నడతోపాటు అన్ని భాషల్లోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు ఈ చిత్రబృందానికి కృతజ్ఞతలు. పొలిటికల్ మీటింగ్స్ ఉండడం వల్ల మీ వేడుకకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను.
కజ్బ సినిమాతో డైరెక్టర్ ఆర్. చంద్రు మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని భావిస్తున్నాను.. విడుదలయ్యే అన్ని భాషల్లోనూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని పవన్ పేర్కొన్నారు. కన్నడ హీరో ఉపేంద్ర, శ్రియా, తాన్యా హోప్ తదితరులు నటించిన కబ్జ సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రయూనిట్ కర్ణాటకలో ఆడియో లాంచ్ నిర్వహించింది. మార్చి 2న ట్రైలర్ రిలీజ్ కానుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
