Principal Dance: పఠాన్‌ పాటకు డాన్స్‌ అదరగొట్టిన ప్రొఫెసర్స్‌.. క్రేజీ అంటున్న నెటిజన్లు.

Principal Dance: పఠాన్‌ పాటకు డాన్స్‌ అదరగొట్టిన ప్రొఫెసర్స్‌.. క్రేజీ అంటున్న నెటిజన్లు.

Anil kumar poka

|

Updated on: Mar 01, 2023 | 9:28 PM

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌ ప‌ఠాన్ మూవీ బాక్సాఫీస్ వ‌సూళ్లలో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటే.. ఇక ఈ సినిమాలోని పాట‌ల‌కు సోష‌ల్ మీడియాలో ప‌లువురు క్రేజీ స్టెప్స్‌తో

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌ ప‌ఠాన్ మూవీ బాక్సాఫీస్ వ‌సూళ్లలో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటే.. ఇక ఈ సినిమాలోని పాట‌ల‌కు సోష‌ల్ మీడియాలో ప‌లువురు క్రేజీ స్టెప్స్‌తో సంద‌డి చేస్తున్నారు. రీక్రియేట్ వీడియోల‌తో దుమ్మురేపుతున్నారు. కాగా, ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోని జీస‌స్ అండ్ మేరీ కాలేజ్‌లోని కొందరు ప్రొఫెస‌ర్లు ప‌ఠాన్‌లోని ఝూమే జో ప‌ఠాన్ సాంగ్‌కు స్టూడెంట్స్‌తో క‌లిసి డాన్స్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను జేఎంసీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామ‌ర్స్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. కాలేజ్ యాంపీథియేట‌ర్‌లో స్టూడెంట్స్ ఝూమే జో ప‌ఠాన్ సాంగ్‌కు స్టెప్పులేస్తున్నారు. ఇంతలో అందమైన శారీస్‌లో ముస్తాబైన ప్రొఫెస‌ర్లు కూడా స్టూడెంట్స్‌తో జతక‌లిసి స్టైలిష్ స్టెప్పుల‌తో డాన్స్‌ అద‌ర‌గొట్టారు. ఈ వీడియోను ఇప్పటికే పది లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రొఫెస‌ర్ల డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో ఇన్‌స్టాగ్రాం యూజ‌ర్లు ఫిదా అయ్యారు. ఇలాంటి ప్రొఫెస‌ర్లు అవ‌స‌ర‌మ‌ని కొంద‌రు యూజ‌ర్లు అంటే, క్రేజీ అని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Mar 01, 2023 09:28 PM