Devara : దేవరాలో జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. ఆ అమ్మడు చాలా ఫేమస్

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేసిన సినిమా ఇది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమా రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

Devara : దేవరాలో జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.. ఆ అమ్మడు చాలా ఫేమస్
Devara
Follow us

|

Updated on: Sep 29, 2024 | 6:10 PM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఎక్కడ చూసినా దేవర సందడే కనిపిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేసిన సినిమా ఇది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమా రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దేవర మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కొరటాల శివ. ఇక దేవర సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.

ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా దేవర ప్రభంజనం కనిపిస్తుంది. దేవర సినిమా చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో , అలాగే కొరటాల శివ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దేవర. ఇక దేవర సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. దేవర సినిమాలో జాన్వీ నటనతో పాటు అందంతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర దేవర మొదటి భాగంలో ఎక్కువగా లేకపోయినా సెకండ్ పార్ట్ లో జాన్వీ రోల్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

ఇదిలా ఉంటే దేవర సినిమాలో జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా.? దేవర సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు జాన్వీ డైలాగ్స్ విని ఆమె కు స్టార్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ డబ్బింగ్ చెప్పిందని అంతా భావించారు. కానీ కాదు జాన్వీ పాత్రకు డబ్బింగ్ చెప్పింది పీవీఎస్ శ్వేత. ఈ అమ్మడు ఆర్జేగా చాలా పాపులర్. తన వాయిస్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా శ్వేత క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో యంగ్ బ్యూటీ కృతిశెట్టికి కూడా  శ్వేతనే డబ్బింగ్ చెప్పింది. అలాగే ఇంకొంతమంది హీరోయిన్స్ కు కూడా డబ్బింగ్ చెప్పింది. ఇక దేవర సినిమాలో జాన్వికపూర్ కు కూడా శ్వేత డబ్బింగ్ చెప్పి ఆకట్టుకుంది. జాన్వీ పాత్రకు శ్వేత వాయిస్ సూపర్ గా సెట్ అయ్యింది. ఇక ఈ ఆర్జే అమ్మడు సోషల్ మీడియాలోనూ రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో