AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: తెలుగులో కాంతార ప్రభంజనం.. ఏకంగా రూ.50 కోట్లు దాటిన వసూళ్లు..

కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగుతోపాటు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్.

Kantara: తెలుగులో కాంతార ప్రభంజనం.. ఏకంగా రూ.50 కోట్లు దాటిన వసూళ్లు..
Kantara Movie
Rajitha Chanti
|

Updated on: Nov 02, 2022 | 2:02 PM

Share

చిన్న సినిమా.. ఎలాంటి అంచనాలు లేవు.. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని హీరో… వెండితెరపై అద్భుతం చేశాడు. భూతకోల సంప్రదాయం అంటే తెలియని తెలుగు ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్దులను చేశాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడా విన్న అతని పేరే. ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయాడు. ప్రాంతీయ సినిమాగా థియేటర్లలో విడుదలైన సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఊహించని రీతిలో కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇంతకీ ఏంటీ ఆ సినిమా అనుకుంటున్నారా ? అదే కాంతార. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో రూపొందించిన ఈ అద్భుతమైన దృశ్యకావ్యానికి దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ భారీ రెస్పాన్స్ వస్తుంది. కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండా సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగుతోపాటు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్.

విడుదలైన అన్ని భాషల్లోనూ అదరగొడుతుంది. ముందు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లోనే 45 కోట్లు సాధించింది. తాజాగా ఈ సినిమా రూ. 50 కోట్ల క్లబ్‏లో చేరింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం ఓ రికార్డ్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

కేవలం ఒక్క తెలుగులోనే రూ. 50 కోట్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్ బ్యానర్ పై విజయ్ కిరాంగదుర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు