Kantara Chapter 1: రిషబ్ శెట్టి కాంతార 2 షూటింగ్‌లో మరో అపశ్రుతి.. జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. ఏం జరిగిందంటే?
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం 'కాంతార: చాప్టర్ 1'. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఒక ప్రమాదం జరిగింది. దీంతో సినిమా సెట్‌లో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కొల్లూరులో జరిగింది. ప్రస్తుతం కాంతార చిత్ర బృందం షాక్ లో ఉంది.

‘కాంతార: చాప్టర్ 1’ చిత్ర బృందానికి తరచూ ప్రమాదాలు ఎదురవుతున్నాయి. గతంలో కాంతారా టీమ్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంంది. కొన్ని రోజుల క్రితం కొల్లూరులోనే జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత గాలి వానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ ధ్వంసమైంది. ఇప్పుడు ఇదే సినిమా షూటింగ్ లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ విషాదకరంగా మరణించాడు. ‘కాంతార: చాప్టర్ 1′ సినిమా షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సినిమా కోసం పనిచేస్తోన్న కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయాడు. ఉడిపి జిల్లా బైందూర్ లోని కొల్లూరులో ఈ ఘటన జరిగింది. షూటింగ్ పూర్తయిన తర్వాత, కపిల్ తన బృందంతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లాడు. నీటి లోతు తెలియకనే వారు నదిలోకి దిగారు. దీంతో అతను నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూనియర్ ఆర్టిస్ట్ మరణంతో చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
కాంతార ఛాప్టర్-1 చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు.’హోంబాలే ఫిల్మ్స్’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది. గతంలో రిలీజై సంచలన విజయం సాధించిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా దీనిని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీంతో ఈ క్రేజీ ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ మూవీ షూటింగ్ సమయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి.
‘కాంతార: చాప్టర్ 1’ చిత్రాన్ని ‘హోంబాలే ఫిల్మ్స్’ నిర్మిస్తోంది. ఈ సినిమాపై జనాలకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. కానీ షూటింగ్ సమయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ మరణం ‘కాంతార: చాప్టర్ 1’ బృందాన్ని బాధించింది. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై చిత్ర బృందం ఒక అధికారిక ప్రకటన వెలువరించనుందని సమాచారం.
కాంతార 2 లో రిషభ్ శెట్టి..
𝐓𝐇𝐄 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 𝐇𝐀𝐒 𝐀𝐑𝐑𝐈𝐕𝐄𝐃 🔥 𝐓𝐇𝐄 𝐃𝐈𝐕𝐈𝐍𝐄 𝐅𝐎𝐑𝐄𝐒𝐓 𝐖𝐇𝐈𝐒𝐏𝐄𝐑𝐒 🕉️#KantaraChapter1 Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.#KantaraChapter1onOct2 #Kantara@shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/VoehP4xW96
— Hombale Films (@hombalefilms) November 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.