AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సీన్ సీన్‏కు హార్ట్ ఎటాకే.. గుండెల్లో ధడ పుట్టించే విజువల్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న 53 కోట్ల సినిమా..

డిజిటల్ రంగంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సత్తా చాటుతున్నాయి. థియేటర్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ నెల రోజుల్లోనే అడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాయి. మరోవైపు ఒరిజినల్ కంటెంట్ వెబ్ సిరీస్, హారర్, రొమాంటిక్ చిత్రాలు ఓటీటీ సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఓ హారర్ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతుంది.

OTT Movie: సీన్ సీన్‏కు హార్ట్ ఎటాకే.. గుండెల్లో ధడ పుట్టించే విజువల్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న 53 కోట్ల సినిమా..
Tumbbad
Rajitha Chanti
|

Updated on: May 07, 2025 | 6:58 AM

Share

మీకు హార్రర్ సినిమాలంటే ఇష్టమా.. ? అయితే సీన్ సీన్‏కు హార్ట్ ఎటాక్ తెప్పించే సినిమా గురించి విన్నారా.. ? ఊహించని ట్విస్టులు, భయపెట్టించే విజువల్స్… ఈ సినిమా దాదాపు 7 ఏళ్లుగా ఓటీటీలో దుమ్మురేపుతుంది. కానీ ఒంటరిగా చూడాల్సిందే గుండె ధైర్యం ఉండాల్సిందే. ఈ సినిమా ఏకంగా 43 అవార్డులకు నామినేట్ అయ్యింది. దాదాపు ఆరేళ్లు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం విడుదలైనప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఇటీవల రీరిలీజ్ చేస్తే మాత్రం రికార్డ్స్ తిరగరాసింది. రీరిలీజ్ సమయంలో ఊహించని రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. ఆ మూవీ మరెదో కాదు.. తుంబాడ్. ఈ సినిమా గురించి తెలియనివారుండరు. మైథలాజికల్ హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు రాహి అలిన్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018లో విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సినిమాలోని ప్రతీ సీన్, ట్విస్టులు, విజువల్స్ మాత్రం ప్రేక్షకులకు వణుకుపుట్టించాయి.

ఇటీవల ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయగా.. అన్ని భాషల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగుతోపాటు హిందీ, మలయాళ, తమిళం భాషలలో విడుదల చేశారు. ఇక విడుదలైన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. ఇటీవల రీరిలీజ్ అయిన ఈ సినిమా రూ.30.4 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. స్వాతంత్ర్యం రాకముందు మహారాష్ట్రలోని తుంబాడ్ అనే గ్రామంలో దాగి ఉన్న నిధఇ గురించి సాగే అన్వేషణతో ఈ కథను రూపొందించారు.

1918లో మహారాష్ట్రలోని కల్మేడ్ గ్రామంలో వినాయక్ రావు తన తల్లి సోదరునితో కలిసి ఉంటాడు. ఆ ఊరి గుడిలో నిధి దాగి ఉందన్న వార్త విని దాని కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే అతడికి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. అత్యాశ మనిషికి ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో అనేది సినిమాలో చక్కగా చూపించారు. ఊహించని హార్రర్ ఎలిమెంట్స్ అనుక్షణం ప్రేక్షకులను భయపెడుతుంటాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

Follow Us