Rhea Chakraborty: సుశాంత్ మరణం.. ఆ హీరోయిన్‌కు అవకాశాలు ఇచ్చేందుకు భయపడుతున్న మేకర్స్..
సుశాంత్ సూసైడ్ చేసుకోవడం సినీ నటీనటులు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అతను సూసైడ్ చేసుకోలేదని.. కచ్చితంగా హత్యే అంటూ ఆరోపణలు వెలువడ్డాయి. కానీ ఇప్పటికీ సుశాంత్ మరణంపై సరైన స్పష్టత మాత్రం రాలేదు. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంపై బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రియాతోపాటు ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన రియా.. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ వీడని మిస్టరీ సుశాంత్ సింగ్ మరణం. అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో.. మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. సుశాంత్ సూసైడ్ చేసుకోవడం సినీ నటీనటులు, అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అతను సూసైడ్ చేసుకోలేదని.. కచ్చితంగా హత్యే అంటూ ఆరోపణలు వెలువడ్డాయి. కానీ ఇప్పటికీ సుశాంత్ మరణంపై సరైన స్పష్టత మాత్రం రాలేదు. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంపై బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రియాతోపాటు ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన రియా.. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చింది. అయినప్పటికీ రియాపై సోషల్ మీడియాలో నెగిటివిటీ, ట్రోలింగ్స్ మాత్రం తగ్గలేదు.
సుశాంత్ మరణం తర్వాత తనకు అవకాశాలు ఇచ్చేందుకు భయపడుతున్నారని వాపోయింది రియా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రియా సుశాంత్ మరణం తర్వాత తాను ఎదుర్కొన్న ట్రోలింగ్స్, పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది. “భయం, ట్రోలింగ్ ఇంకా ఉందని భావిస్తున్నాను. అన్ని పరిస్థితులను ఎదుర్కొన్నాను. కానీ త్వరలోనే అంతా సాధారణ స్థితికి వస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పటికీ చాలావరకు నాపై ట్రోలింగ్, నెగిటివిటీ తగ్గిపోయింది. గతంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ ఎదుర్కొన్న వ్యక్తిగా నేను మొదటి స్థానంలో ఉన్నాను. కానీ ఆ సమయంలో నాకు నా కుటుంబసభ్యులు, స్నేహితులు తోడుగా నిలిచారు. నాకు నా కుటుంబానికి వారు మానసికంగా, ఆర్థికంగా సహాయం చేశారు. అది నాకు బలాన్ని ఇచ్చింది. ఇప్పటికీ నాకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు భయపడుతున్నారు. ఎవరూ ఛాన్సులు ఇవ్వడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రియా.
View this post on Instagram
2013లో యష్ రాజ్ ఫిల్మ్స్ షూటింగ్ సమయంలో రియా, సుశాంత్ మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో సుశాంత్ శుద్ద్ దేశీ సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరి షూటింగ్ సెట్స్ దగ్గరగా ఉండడంతో స్నేహితులయ్యారు. 2019లో వీరిద్దరు కలిసి వెకేషన్ వెళ్లిన ఫోటోస్ బయటకు రావడంతో వీరి ప్రేమ విషయం ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత కేవలం ఆరు నెలల్లోనే సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. దీంతో ఈ కేసులో రియాను పోలీసులు అరెస్ట్ చేశారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.