Ram Gopal Varma: వర్మ.. ఏంటి నీకీ ఖర్మ?
కనబడుట లేదు..! అని పోస్టర్లంటించడం ఒక్కటే తక్కువ. మూడు రాష్ట్రాల్లో జల్లెడ పట్టి గాలించినా దొరకడం లేదా పెద్దమనిషి. ఏపీ పోలీసుల్ని మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్న ఆ శాల్తీ ఎవరనుకున్నారు.. ఇంకెవరు.. రామ్‌గోపాల్ వర్మ. చిక్కను దొరకను అంటూ హైడ్ అండ్ సీక్ ఆడుతున్న వర్మ కోసం వేట ఓ రేంజ్‌లో నడుస్తోంది.

కిర్రాక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఎక్కడ? ఏ రాష్ట్రంలో దాక్కున్నారు.. ఆయనకు ఎవరు ఆశ్రయమిచ్చారు.. అనే మిస్టరీ ఇంకా విడిపోలేదు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తూనే ఉన్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. ఈనెల 23న కోయంబత్తూరులో లూసీఫర్-2 సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్టు.. అక్కడి నటులతో తీసుకున్న వర్మ ఫొటోల్ని బట్టి తెలుస్తోంది. దీంతో వెంటనే వర్మ కోసం కోయంబత్తూరు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇటు.. వర్మ ఆచూకీ కోసం హైదరాబాదులోని ఫిలింనగర్‌లో రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హైదరాబాద్, తమిళనాడు పోలీసులతో ఒంగోలు ఎస్పీ దామోదర్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మద్దిపాడు పీఎస్ లో ఈనెల 10న వర్మపై కేసు నమోదైంది. సినిమా ప్రమోషన్ పేరుతో సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెట్టారన్నది వర్మపై నమోదైన అభియోగం. రెండుసార్లు విచారణకు పిలిచినా హాజరుకాకపోవడంతో ఆయనకు నోటీసులిచ్చారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆర్జీవీ పిటిషన్ వేశారు. విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. వివాదాస్పద సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు సోషల్ మీడియా పోస్టింగుల వ్యవహారం చివరకు అతని మెడకే చుట్టుకుంది. నిత్యం వివాదాల్లో ఉండే ఈ డైరెక్టర్ వైసీపీ మద్దతుదారుడిగా ముద్ర పడింది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత, యువనేత ,జనసేన అధినేత టార్గెట్ గా పెట్టిన పోస్టింగులు ఇప్పుడు అతనిని...




