Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: బ్లాక్ బస్టర్ హిట్ మళ్లీ వచ్చేస్తోంది.. మాస్ మాహారాజా ‘వెంకీ’ రిరీలీజ్.. ట్రైలర్ ఎప్పుడంటే..

. డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. రవితేజ కెరీర్‏లో‏నే కామెడీ క్లాసిక్ హిట్‍గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు ప్రజలకు ఇష్టమైన సినిమా అని చెప్పడంలో సందేహం లేదు. ఇందులో రవితేజ కామెడీ ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇందులో స్నేహ కథానాయికగా నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందంచారు. ఈచిత్రాన్ని లక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అట్లూరి పూర్ణ చంద్రరావు నిర్మించారు.

Raviteja: బ్లాక్ బస్టర్ హిట్ మళ్లీ వచ్చేస్తోంది.. మాస్ మాహారాజా 'వెంకీ' రిరీలీజ్.. ట్రైలర్ ఎప్పుడంటే..
Venky Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 24, 2023 | 10:24 AM

మాస్ మాహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘వెంకీ’. 2004లో విడుదలైన ఈ సూపర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. రవితేజ కెరీర్‏లో‏నే కామెడీ క్లాసిక్ హిట్‍గా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు ప్రజలకు ఇష్టమైన సినిమా అని చెప్పడంలో సందేహం లేదు. ఇందులో రవితేజ కామెడీ ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇందులో స్నేహ కథానాయికగా నటించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందంచారు. ఈచిత్రాన్ని లక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అట్లూరి పూర్ణ చంద్రరావు నిర్మించారు. ఈ సినిమా ఇప్పుడు మరోసారి బిగ్ స్క్రీన్ పై అలరించేందుకు వచ్చేస్తుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ 30న గ్రాండ్ గా రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ మూవీ ట్రైలర్ మాత్రం రేపు (డిసెంబర్ 25)న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో వెంకీ రీరిలీజ్ పై మాస్ మాహారాజా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా మంచి హిట్ కాగా.. రవితేజ, బ్రహ్మానందంల కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఈ సినిమాకు పెద్ద హైలెట్ అయ్యాయి.

ఇక రవితేజ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈగిల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో నవదీప్, మధుబాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోపాటు.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలోనూ మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు రవితేజ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.