- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroes Prabhas, NTR, Mahesh Babu are busy in movie Shooting
Movie Shooting: చిత్రీకరణలో బిజీగా ఉన్న టాలీవుడ్ హీరోలు.. ఎవరు ఎక్కడున్నారంటే..
చూస్తుండగానే ఏడాదే చివరికి వచ్చేసింది.. కాలెండరే మారిపోతుంది.. ఇక ఒక్క వారం ఎంతసేపు అయిపోతుంది చెప్పండి..? అందుకే మరో మండే వచ్చేసింది కాబట్టి ఈటీ కూడా షూటింగ్ అప్‌డేట్స్ తెచ్చేసింది. అదేంటో కానీ ఒకరిద్దరు హీరోలు తప్ప మిగిలిన వాళ్ళంతా బుద్ధిగా సెట్‌లోనే ఉన్నారు. మరి మన హీరోలెక్కడున్నారు.. ఏం చేస్తున్నారో చూద్దాం పదండి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Dec 24, 2023 | 10:32 AM

మేం చాలా బిజీ అంటున్నారు మన హీరోలు. ప్రభాస్ అయితే ఓ వైపు సలార్ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు నాగ్ అశ్విన్ కల్కి సినిమాకు డేట్స్ ఇచ్చారు. ఈ చిత్ర షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది.

ఇక మహేష్ బాబు గుంటూరు కారం షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్‌లో జరుగుతుంది. ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణ డిసెంబర్ 21 నుంచి మొదలైందని నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దేవర షూటింగ్ నాన్‌స్టాప్‌గా కొన్ని నెలలుగా శంషాబాద్‌లోనే జరుగుతుంది. అక్కడే మేజర్ పార్ట్ పూర్తి చేస్తున్నారు కొరటాల. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో నడుస్తుండగా.. నాగార్జున నా సామిరంగ షూట్ జెట్ స్పీడ్‌లో వట్టినాగులపల్లిలో జరుగుతుంది. డిసెంబర్ 19 నుంచి అన్నపూర్ణకు షిప్ట్ కానుంది షూటింగ్.

విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. గోపీచంద్ భీమ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ముగించుకుని చిక్ మంగుళూరుకి షిఫ్ట్ కానుంది.

నితిన్, వెంకీ కుడుముల సినిమా షూటింగ్ మారేడు మిల్లిలో.. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. డిసెంబర్ 26 నుంచి గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.





























