Ravi Teja: రావణాసురగా మెప్పిస్తానంటున్న రవితేజ.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ లో మాస్ రాజా..
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రవితేజ. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ ను ఓకే చేశాడు. వాటిలో క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ మూవీ కూడా ఒకటి. ఈ కాంబినేషన్ లో రాబోతున్న సూపర్ క్రేజీ మూవీ రావణాసుర. ఈ భారీ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. దీపావళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రావణాసురలో కథానాయకుడు పది డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తుండడం విశేషం.
రావణాసురలో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా సంక్రాంతి పండక్కి జనవరి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. రావణాసుర చిత్రానికి శ్రీకాంత్ విస్సా పవర్ ఫుల్ స్టోరీ అందించారు. స్టైలిష్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నారు. రావణాసుర సినిమాలో రవితేజ విలక్షణమైన పాత్రలో కనిపిస్తాడని పోస్టర్‌లోనే తెలిసిపోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉండబోతోంది. ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నటీనటుల, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :