Liger Glimpse-Vijay Devarakonda: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న రౌడీ విజయ్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న

Liger Glimpse-Vijay Devarakonda: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న రౌడీ విజయ్..
Liger
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2022 | 1:52 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల న్యూఇయర్ సందర్భంగా అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేశారు పూరి అండ్ టీం. చిత్రప్రమోషన్స్‏లో భాగంగా లైగర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసి విజయ్ దేవరకొండ అభిమానుల్లో జోష్ నింపారు. పూరి మార్క్ యాక్షన్ సన్నివేశాలతో కట్ చేసిన ఈ వీడియో.. విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండను పూర్తిగా సరికొత్త లుక్‏లో చూపించి ఫ్యాన్స్‏ను ఖుషి చేశారు పూరి. కొత్త సంవత్సరం రోజున విడుదలైన లైగర్ గ్లింప్స్ యూట్యూబ్‏లో రికార్డ్స్ కొల్లగొడుతుంది.

రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే 10 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకున్న లైగర్ గ్లింప్స్.. తాజాగా 25 మిలియన్‏కు వ్యూస్ మైలురాయిని చేరింది. 5.5 లక్షల లైక్స్ సొంతం చేసుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. నేషనల్ వైడ్ ట్రెండింగ్ టాప్‏లో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ మేనియా కొనసాగుతుంది. ఈ సినిమాలో విజయ్ కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ మేకోవర్.. సరికొత్త యాటిట్యూడ్‏తో కనిపించడంతో రౌడీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్డేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‏తో లైగర్ మూవీ తెరకెక్కుతుండగా.. ఇందులో బాక్సర్‏గా కనిపించనున్నాడు విజయ్. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్‏గా మారబోతున్నారు.

ఈ పాన్ ఇండియా మూవీని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తుండగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

ఛాయ్ వాలా టు బాక్సర్.. ముంబై లో ఛాయ్ వాలా గా జీవనం సాగించే వ్యక్తి ఎలా బాక్సర్ గా ఎదిగాడన్నది గ్లింప్స్‏లో చూపించారు పూరి. లైగర్ సినిమాలో మైక్ టైసన్ పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా..  అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ.. 

Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..

Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‏గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..

Ram Gopal Varma: అధికారం ఇచ్చింది మా తలపై కూర్చోవడానికి కాదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?