Mahanati Savitri: అప్పట్లోనే మహానటి సావిత్రి కోసం విదేశాల నుంచి అభిమానులు.. రేర్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు..

Mahanati Savitri: కళ్ళతోనే నవరసాలను పలికించే అరుదైన నటిగా భారత చలన చిత్ర పరిశ్రమలో  చెరగని ముద్ర వేసుకున్న మహానటి  సావిత్రి. చిన్న వయసులోనే మరణించినా సావిత్రిని..

Mahanati Savitri: అప్పట్లోనే మహానటి సావిత్రి కోసం విదేశాల నుంచి అభిమానులు.. రేర్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు..
Savitri Rare Photo
Follow us
Surya Kala

|

Updated on: Jan 04, 2022 | 3:02 PM

Mahanati Savitri: కళ్ళతోనే నవరసాలను పలికించే అరుదైన నటిగా భారత చలన చిత్ర పరిశ్రమలో  చెరగని ముద్ర వేసుకున్న మహానటి  సావిత్రి. చిన్న వయసులోనే మరణించినా సావిత్రిని గుర్తు చేసుకోని సినీ నటులే కాదు.. అభిమానులు బహు అరుదు. అయితే సావిత్రికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా, ఫోటోలైనా ఎప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలాంటి ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. అప్పట్లోనే సావిత్రిని కలవడానికి విదేశాల నుంచి అభిమానులు వచ్చేవారని ఈ ఫోటో ద్వారా తెలుస్తోంది.

1962 లో తమ అభిమాన నటి సావిత్రిని కలవడానికి మలేషియా నుంచి కొంతమంది మహిళా అభిమానులు వచ్చారు. అప్పుడు మహానటి సావిత్రి తన అభిమానులతో తీసుకున్న అరుదైన ఫోటో.. ఫ్యాన్స్ కు కనువిందు చేస్తోంది. ఆ ఫొటోలో మలేసియా నుంచి వచ్చిన ఆ అభిమానులు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరలు ధరించి సావిత్రితో ఫోటో తీయించుకున్నారు. ఈ అరుదైన చిత్రం సావిత్రి అభిమానులకు కనుల విందు చేస్తోంది. అంతేకాదు ఇప్పటిలా అప్పట్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ లు ఏమీ లేవు.. అయినప్పటికీ మహానటి ఖ్యాతి విదేశాల్లో ఏ రేంజ్ లో ఉందొ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఈ నటశిరోమణి జీవితంలో ఎన్నో మలుపులు..ఎత్తుపల్లాలు. “కనులతోనే పాత్రల్లో నటించి ఆ పాత్రల్లో జీవించి సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అభినేత్రి. సావిత్రి జీవితం.. ఆమె ధరించిన ఏ పాత్రకూ తీసిపోదు. సినీ వినీలాకాశంలో  తారాజువ్వలా తారామండలానికి ఎగిసి.. మితిమీరిన బోళాతనంతో తోకచుక్కలా రాలి..  రోగగ్రస్తమై చివరి దశలో అనేక కష్టాలు పడి జీవన రంగస్థలి నుండి నిష్క్రమించిన తారామణి సావిత్రి.

Also Read:  షార్‌లో కరోనా కలకలం..12 మందికి కరోనా నిర్ధారణ.. భయాందోళనలో ఉద్యోగులు..