AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

M.S. Raju : నా సినిమా చూసి అందరు చెవులు కోరుకున్నారు.. కానీ చివరకు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఎం.ఎస్ రాజు..

మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో "సంక్రాంతి రాజు" గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు

M.S. Raju : నా సినిమా చూసి అందరు చెవులు కోరుకున్నారు.. కానీ చివరకు.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన ఎం.ఎస్ రాజు..
Ms Raju
Rajeev Rayala
|

Updated on: Jan 04, 2022 | 9:21 PM

Share

M.S. Raju : మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు దర్శకుడిగానూ ప్రతిభ చాటుతున్నారు. ఇటీవలే  ‘డర్టీ హరి’ లాంటి సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను  సంక్రాంతి రిలీజ్ బరిలో ఉంచనున్నారు. మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు.

ఈ సందర్భంగా దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ, “నేను నా కెరీర్ లో అన్ని జానర్ చిత్రాలు చేసాను, ఇక కేవలం మసాలా చిత్రాలకి మాత్రమే పరిమితం కాకుండా, ఎవరు చేయనివి చేద్దామనుకుంటున్నాను. నా ‘డర్టీ హరి’ పోస్టర్లు చూసి నేనిలా అయిపోయాను అని చెవులు కొరుక్కున్న వారు చిత్రంలోని చివరి 40 నిమిషాలకి ఇచ్చిన స్పందన ఇప్పటికీ గుర్తుంది. అదే పంథాలో నాకు నచ్చేలా అందరూ మెచ్చేలా ఈసారి ఒక న్యూ జెన్ రోమ్-కామ్ చిత్రంతో అన్ని రకాల ప్రేక్షకులని అలరించబోతున్నాం. బాచిలర్ ట్రిప్ కోసం గోవా కి వెళ్లిన 2 యువకులు, 2 యువతుల చుట్టూ జరిగే కథ ఇది. క్లాసిక్ చిత్రంగా మారే అన్ని హంగులు ఇందులో ఉన్నాయి. ప్రతీ ఒక్కరు, తమని తాము ఇందులోని పాత్రలకి బాగా రిలేట్ చేసుకుంటారు. సంక్రాంతి కి రానున్న ఈ చిత్రం, అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం” అని అన్నారు. సంక్రాంతి బరిలోని భారీ చిత్రాల మధ్య విడుదల చేస్తూ కూడా ఎం. ఎస్. రాజు ఈ చిత్ర విజయం పై పూర్తి విశ్వాసం తో ఉండడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Liger Glimpse-Vijay Devarakonda: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న లైగర్ గ్లింప్స్.. రికార్డ్స్ కొల్లగొడుతున్న రౌడీ విజయ్..

Bigg Boss Telugu OTT: తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లాంచ్ డేట్ అప్పుడేనా.. కంటెస్టెంట్లు వీరేనా.!

Viral Photo: పిస్టోల్ చేతపట్టి స్టైల్‏గా ఫోటోకు ఫోజిచ్చిన ఈ చిన్నది.. ఇటు సౌత్, అటు నార్త్‏లో దూసుకుపోతుంది..

Follow Us
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
ఏనుగుల దినోత్సవం.. ఇంత తెలివైనవా? అచ్చం మనుషుల్లానే చేస్తాయా
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
దేవుడి ముందు ప్రార్థిస్తున్నప్పుడు చెడు ఆలోచనలు ఎందుకు వస్తాయి?..
ఏయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏయిర్‌ పోర్టులో అనుమానంగా కనిపించిన ప్రయాణికుడు.. ఆపి చెక్‌ చేయగా
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
2026లో భారత్‌లో అత్యధిక జీతాలు అందించే టాప్ 10 ఉద్యోగాలు..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుంది..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
సామాన్యులకు రైల్వేశాఖ బిగ్ రిలీఫ్..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
16 సోమవారాల వ్రతానికి శ్రావణ మాసమే ఎందుకు ప్రత్యేకం? దీని వెనుక..
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
తెలంగాణ తరహాలో స్టైఫండ్ ఇవ్వాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..
కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు.. మారనున్న రూపురేఖలు..