Ravi Teja: మెగాస్టార్ మూవీ కోసం రవితేజ.. అతిథి పాత్రకే అంత డిమాండ్ చేశాడా..?
సినిమా హిట్ అయ్యిందంటే చాలు రెమ్యునరేషన్ అమాంతం పెంచస్తుంటారు కొందరు. మరి కొంత మంది చిన్న చిన్న పాత్రలకు కూడా షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకొని ప్రొడ్యూసర్స్ కు చుక్కలు చూపిస్తూ ఉంటారు.

Ravi Teja: సినిమా హిట్ అయ్యిందంటే చాలు రెమ్యునరేషన్ అమాంతం పెంచస్తుంటారు కొందరు. మరి కొంత మంది చిన్న చిన్న పాత్రలకు కూడా షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకొని ప్రొడ్యూసర్స్‌కు చుక్కలు చూపిస్తూ ఉంటారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ రెమ్యునరేషన్ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక సినిమాలో కీలకపాత్ర కోసం రవితేజ భారీ ఎమ్యూనరేష్ అడిగినట్టు తెలుస్తుంది. రవితేజ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
వీటితోపాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరు చెల్లెలుగా కనిపించనుంది. అలాగే దర్శకుడు బాబీ మెగాస్టార్ తో ఓ మాస్ మసాలా సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు వాల్తేరు వీరన్న అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మాస్ రాజా రవితేజ నటిస్తున్నారు. ఒక్కో చిత్రానికి ప్రస్తుతం 17 నుంచి 18 కోట్లు డిమాండ్ చేస్తున్నారట రవితేజ. అయితే మెగాస్టార్ సినిమాకు మాత్రం కీలక పాత్రకే ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ పాత్ర కోసం రవితేజ 20 నుంచి 25 రోజులు కేటాయిస్తున్నారట.. అందుకే ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :




