AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S. S. Rajamouli: జగన్‌ను కలిసిన జక్కన్న.. సీఎంతో రాజమౌళి ఏ విషయం పై చర్చించారంటే..

టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఇటీవల సినీ పెద్దలు కలిసిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ సమస్యల పై సానుకూలంగా స్పందించారు సీఎం.

S. S. Rajamouli: జగన్‌ను కలిసిన జక్కన్న.. సీఎంతో రాజమౌళి ఏ విషయం పై చర్చించారంటే..
Rajamouli, Cm Jagan
Rajeev Rayala
|

Updated on: Mar 14, 2022 | 5:23 PM

Share

S. S. Rajamouli: టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఇటీవల సినీ పెద్దలు కలిసిన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ సమస్యల పై సానుకూలంగా స్పందించారు సీఎం. ఏపీలో టికెట్ రేట్లను పెంచుతూ జీవోను విడుదల చేసింది. అయితే ఈ నేపథ్యంలో రాజమౌళి ఇప్పుడు జగన్ ను కలవడం హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి భారీ బ‌డ్జెట్‌తో రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి, ఈ సినిమా నిర్మాత దాన‌య్య‌తో క‌లిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న రాజ‌మౌళి, దాన‌య్య అనంత‌రం అక్క‌డి నుంచి తాడేప‌ల్లిలోని ఏపీ సీఎం జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యానికి వెళ్లారు.

ఈ నెల 25 ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అంశంపై సీఎం జగన్ తో రాజమౌళి చర్చించారని తెలుస్తుంది. ఏపీలో ప్రత్యేక షోలు వేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు రాజమౌళి. అలాగే సినిమా టిక్కెట్లు ధరల అంశంపై రాజమౌళి చర్చించారు. రాజమౌళి పాటు సమావేశంలో మంత్రులు పేర్ని నాని ,కొడాలి నాని కూడా పాల్గొన్నారు. ఇక రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో అలియా భట్.. అజయ్ దేవ్ గణ్.. శ్రియ సరన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సాంగ్స్ మూవీపై అంచనాలను మరింత పెంచాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bahubali 3: మాహిష్మతి రాజ్యం నుంచి కొత్త వార్త రానుంది.. బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు..

హర్మోనియం మెట్ల మీద ఆయన చేతి వేళ్లు కదిలితే చాలు సప్తస్వరాలు తుళ్లిపడేవి!

NTR: అన్న గారి ఫొటో వెనుక గమ్మత్తైన విషయం దాగి ఉంది.. ఏంటో గుర్తు పట్టండి..

Follow Us
నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. శ్రీ కుంకుళ్లమ్మ దీక్షలతో
నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. శ్రీ కుంకుళ్లమ్మ దీక్షలతో
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!