AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌ను ఫాలో అయ్యేది 57 లక్షల మంది.. ఆయన ఫాలో అయ్యేది మాత్రం ఒక్కరినే, ఇంతకీ అతనెవరంటే..

NTR: ఎన్టీర్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుతన నటన, ఆకట్టుకునే డైలాగ్‌లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు తారక్‌. ప్రస్తుతం ఈ యంగ్‌ టైగర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు...

NTR: ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌ను ఫాలో అయ్యేది 57 లక్షల మంది.. ఆయన ఫాలో అయ్యేది మాత్రం ఒక్కరినే, ఇంతకీ అతనెవరంటే..
Ntr
Narender Vaitla
|

Updated on: Mar 14, 2022 | 3:56 PM

Share

NTR: ఎన్టీర్‌కు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అద్భుతన నటన, ఆకట్టుకునే డైలాగ్‌లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు తారక్‌. ప్రస్తుతం ఈ యంగ్‌ టైగర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్‌ అభిమానుల్లో జోష్‌ని పెంచేశారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్స్‌లో జూనియర్ అద్భుతంగా కనిపించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల నేపథ్యంలో తారక్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న హంగామా మాములుగా ఉండడం లేదు. మార్చి 25న విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటి నుంచే సందడి మొదలు పెట్టేశారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న జూనియర్‌ ఫ్యాన్స్‌ చేస్తున్న రచ్చకు సంబంధించి రోజుకో వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ఎన్టీఆర్‌ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత సమాచారాన్ని అభిమానులతో పంచుకోవడం ఎన్టీఆర్‌కు అలవాటు. ఇక ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌ అత్యధిక ఫాలోవర్స్‌తో దూసుకుపోతున్నారు. జూనియర్‌ను ఏకంగా 57 లక్షల మంది ఫాలో అవుతున్నారు. మరి తనను అంత మంది ఫాలో అవుతున్నప్పుడు ఎన్టీఆర్‌ ఎంత మందిని ఫాలో అవుతున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.

Ntr Twitter

 

ఎన్టీఆర్‌ ట్విట్టర్‌లో కేవలం ఒక్కరిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరనేగా మీ సందేహం. జూనియర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన దర్శకుడు రాజమౌళి. స్టూడెంట్‌ నెం1తో మొదలైన వీరిద్దరి ప్రయాణం సింహాద్రి, యమదొంగ, ఆర్‌ఆర్‌ఆర్‌తో కొనసాగుతోంది. అందుకే రాజమౌళి అంటే ఎన్టీఆర్‌కు ఎంతో అభిమానం. జక్కన్న కూడా ఇంత వరకు ఎక్కువ సార్లు డైరెక్ట్‌ చేసిన హీరో ఎన్టీఆర్‌ కావడం విశేషం. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ట్విట్టర్‌ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోందని జూనియర్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Also Read: Brother Anil: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై బ్రదర్ అనిల్ సంచలన కామెంట్స్.. దోషులు తప్పించుకోలేరని వ్యాఖ్యలు..

Health Tips: వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించుకోండిలా..

Hyderabad: నాలుగేళ్ల తర్వాత నగరంలో ఏవియేషన్‌ షో.. వింగ్స్ ఇండియా 2022 ఎప్పుడు ప్రారంభం కానుందంటే..