Ravi Teja: పూరిజగన్నాథ్ తమ్ముడి సినిమా టీజర్ రిలీజ్ చేసిన మాస్ మహారాజ్..

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సాయిరామ్ శంకర్. 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు ఈ యంగ్ హీరో.

Ravi Teja: పూరిజగన్నాథ్ తమ్ముడి సినిమా టీజర్ రిలీజ్ చేసిన మాస్ మహారాజ్..
Ravi Teja
Follow us

|

Updated on: Jun 02, 2022 | 6:50 PM

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్(Puri Jagannadh) తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సాయిరామ్ శంకర్(Sairam Shankar ). 143, బంపర్ ఆఫర్ లాంటి హిట్ సినిమాలతో ఆకట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ కుర్ర హీరో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘ఒక పథకం ప్రకారం’. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్.

తాజాగా ఈ చిత్ర టీజర్ మాస్ రాజా రవితేజ చేతుల మీదుగా విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. సినిమా కాన్సెప్టును టీజర్ లోనే చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నారు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ఒక పథకం ప్రకారం సినిమా టీమ్ లో ఉన్నారు. ఈ సినిమా జూన్ 24న విడుదల కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

ఇవి కూడా చదవండి