Virata Parvam: నగదారిలో ఫుల్ సాంగ్ వచ్చేసింది.. మరో లోకంలోకి తీసుకెళ్తున్న అద్భుతమైన ప్రేమకావ్యం..
ఇందులో రానా సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ మూవీ పై మరింత
టాలెంటెడ్ హీరో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న సినిమా విరాట పర్వం (Virata Parvam). ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో రానా సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ మూవీ పై మరింత ఆసక్తిని కలిగించింది.. అలాగే ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూన్ 1న ఈ సినిమా నుంచి నగదారిలో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్… తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. నిప్పు ఉంది.. నీరు ఉంది.. నగదారిలో.. చివరకు నెగ్గిదేది.. తగ్గేదేది నగదారిలో అంటూ సాగే పాట ఆకట్టుకుంటుంది..
కాలం ప్రేమ కథకు తన చేయనందించి నేడు.. తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు.. నీ తోడే పోంది జన్మే నాది ధన్యమయేరో.. అంటూ వచ్చే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ద్యావరి నరేందర్ రెడ్డి, సనపతి భరద్వాజ్ సాహిత్యం అందించిన ఈ పాటకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా. వరం అద్భుతంగా ఆలపించారు. . నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా.. రవి శంకర్ అలియాన్ రవన్న పాత్రలో నటించగా. సాయి పల్లవి వెన్నెల పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు.