Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మురారి వా సాంగ్ వచ్చేసిందోచ్..
ఇందులో మహేష్, కీర్తి సురేష్ లుక్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా... ఈ మూవీలోని ప్రతి సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి..
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. డైరెక్టర్ పరశురామ్ కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మే 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అనుహ్యమైన స్పందన వచ్చింది. ఇందులో మహేష్, కీర్తి సురేష్ లుక్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా… ఈ మూవీలోని ప్రతి సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.. తాజాగా మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమాలో మురారి వా పాటను యాడ్ చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు.
సర్కారు వారి పాట సెకండాఫ్ లో మ మ మహేష అనే ఒకే ఒక్క పాట మాత్రమే ఉంటుంది. అయితే ఇంకో పాటను కూడా రెడీ చేశారు. కానీ దానిని సినిమాలో పెట్టలేదు. ఈ సాంగ్ విషయంపై సినిమా ప్రమోషన్లలో మహేష్ కూడా పెదవి విప్పాడు.. మురారి పాటను నేరుగా యూట్యూబ్ లో విడుదల చేస్తామన్నారు మహేష్ బాబు. కానీ.. తాజాగా ఈ సినిమా కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ పాటను సినిమాలో యాడ్ చేశారట. ఇకపై థియేటర్లలో ఈ పాట ప్లే అవుతుందట. సినిమాలో మురారి పాట యాడ్ చేశామంటూ మేకర్లు ప్రకటించారు. మురారి వా పాటను చూడాలంటే ఇక ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్లాల్సిందే. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. జూన్ నెలలో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
The most awaited news is here! ? The MASS Melody #MurariVaa song now attached to #SarkaruVaariPaata on the Big Screens!#BlockbusterSVP
Super? @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/cpcRjny4mb
— Mythri Movie Makers (@MythriOfficial) June 1, 2022