Vikram: థియేటర్లలో సందడి చేయనున్న విక్రమ్.. కమల్ సినిమా టికెట్స్ రేట్స్ ఏంతంటే..
ఇందులోస విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, తమిళ్ స్టార్ సూర్య కీలకపాత్రలలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం విక్రమ్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులోస విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్, తమిళ్ స్టార్ సూర్య కీలకపాత్రలలో నటించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. జూన్ 3న విక్రమ్ (Vikram) సినిమా తమిళంతోపాటు. తెలుగులోనూ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ హక్కులను శ్రేష్ట్ మూవీస్ సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టికెట్ ధరల వివరాలను సోషల్ మీడియా వేదికగా శ్రేష్ట్ మూవీస్ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రిన్స్ తెలంగాణలో రూ. 150 ఉండగా.. ఏపీలో రూ. 147 ఉంది. ఇక తెలంగాణంలో మల్టీప్లెక్స్ రూ.195 ఉండగా.. ఏపీలో రూ.177 (జీఎస్టీతో కలిపి) ఉంటాయని తెలిపింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించగా.. అనిరుధ్ సంగీతం అందించారు. కమల్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య మాత్రమే కాకుండా ఈ మూవీలో కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన మత్తుగా మత్తుగా అనే మాస్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
The Much awaited Action Drama #VikramHitlist is coming to you with REASONABLE LOW TICKET PRICES ?
Releasing WW On June 3rd ?
Book your tickets now! – https://t.co/Mq3WheW9hP – https://t.co/CVSr0U2QKw#Vikram @ikamalhaasan @Dir_Lokesh @RKFI @actor_nithiin @SreshthMovies pic.twitter.com/4PItJHd54V
— Sreshth Movies (@SreshthMovies) June 1, 2022