Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Recce: ఆసక్తికరంగా రెక్కీ మోషన్ మోస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో వీక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది..కొత్తగా నియమించబడిన లెనిన్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్ "రెక్కీ" లో

Recce: ఆసక్తికరంగా రెక్కీ మోషన్ మోస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Recce
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 02, 2022 | 6:34 AM

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5లో సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెక్కీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిరీస్ 1990ల నాటి గ్రిప్పింగ్ పీరియడ్ థ్రిల్లర్. కథ 7 ఎపిసోడ్‌ల వ్యవధిలో (ఒక్కొక్కటి 25 నిమిషాలు) నిడివి ఉంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం రెక్కీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దర్శకుడు పోలూరు కృష్ణ ఈరోజు మాట్లాడుతూ..,తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో ఎన్నో ఉత్కంఠభరితమైన సంఘటనలతో వీక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది..కొత్తగా నియమించబడిన లెనిన్ అనే సబ్ ఇన్‌స్పెక్టర్ “రెక్కీ” లో ఎక్సపెర్ట్ అయిన పరదేశిల మధ్య ఈ కథ నడుస్తుందన్నారు. 1992లో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ వరదరాజులు హత్యకు ఎలా ప్లాన్ చేశారు. ఇన్స్పెక్టర్ లెనిన్ ఈ కేసును ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి చేదించాడు అనేది కథ.

మోషన్ పోస్టర్ లోని “రెక్కీ” అప్పిరియన్స్ చూస్తుంటే, ”ఇందులో ఉత్కంఠభరితమైన డ్రామాతో పాటు ఉత్తేజకరమైన ట్విస్ట్ & టర్న్‌లతో సుసంపన్నమైన రోలర్-కోస్టర్ రైడ్ లా కనిపిస్తుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌ లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ మరింత ఉత్కంఠ రేపుతోంది. తాడిపత్రిలో పేరుమోసిన ఫ్యాక్షన్ హింస అంశం చుట్టూ అన్వేషించబడినట్లు కనిపిస్తోంది. చలనచిత్రాలు, ఇతర పాప్ సంస్కృతి దృగ్విషయాల ద్వారా, మనకు ఉన్నత స్థాయి ఫ్యాక్షన్ నాయకుల హత్యల గురించి మాత్రమే తెలుసు. అయితే ‘రెక్కీ’వెబ్ సిరీస్ ద్వారా ఒక ఘోరమైన సంఘటనల వెనుక దాగివున్న విషయాల వెలికి తీస్తుంది. ఈసీరీస్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎలా ఉండబోతుందో ప్లాట్ వివరణ సూచిస్తుంది. “90వ దశకం ప్రారంభంలో తాడిపత్రిలో, రూకీ సబ్-ఇన్‌స్పెక్టర్ లెనిన్‌కు అక్కడ జరిగిన జంట హత్యలను ఛేదించే పనిని అప్పగిస్తారు. ఈ హంతకులు రాజకీయంగా ప్రేరేపించబడ్డారా, కక్ష పూరితంగా చేసిందా లేక అంతకంటే చీకటి కోణం ఏమైనా ఉందా? అనే విషయాలను లెనిన్ పరిశోధనతో కొన్ని అనూహ్య కరమైన రహస్యాలను కనుగొనేలా చేస్తుంది.

శ్రీరామ్, శివబాలాజీ ఇంతవరకూ చేయని పాత్రలు ఇందులో చేశారు. సీరీస్‌లోని ప్రధాన భాగాలను అనంతపురంలో చిత్రీకరించారు. దర్శకుడు మరియు ఇతర సాంకేతిక నిపుణులు ఈ సిరీస్‌ కథను ఓన్ చేసుకొని ప్రేక్షకులకు వాస్తవికమైన సంఘటనలను వివరించడం జరిగింది. గ్రామీణ ఫ్యాక్షన్ క్రైమ్ డ్రామా తో వస్తున్న ఇలాంటి కథలు ప్రేక్షకులు చూసి చాలా కాలం అయ్యింది కాబట్టి, వీక్షకులకు ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చారు.