AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

9 Hours: డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో 9 అవర్స్ వెబ్ సిరీస్.. రియల్ టైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

టెలివిజన్ సీరియల్స్ నిర్మించడం ఖర్చుతో, శ్రమతో కూడిన పని. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక ఒక మంచి కథను వెబ్ సిరీస్ గా చూపించే వీలు దొరికింది

9 Hours: డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లో 9 అవర్స్ వెబ్ సిరీస్.. రియల్ టైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
9 Hours
Rajitha Chanti
|

Updated on: Jun 02, 2022 | 11:09 AM

Share

నందమూరి తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధుషాలినీ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న వెబ్ సిరీస్ 9 అవర్స్. నందమూరి తారకరత్న చాలా కాలం తర్వాత ఈ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ సిరీస్ కు షో రన్నర్ గా వ్యవహరిస్తుండగా.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి వై, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. దీనికి నిరంజన్ కౌషిక్, జెకబ్ వర్గీస్ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జూన్ 2 తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. (9 Hours) ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి షో రన్నర్ క్రిష్, మేకర్స్, ప్రధాన తారగణం పాల్గోన్నారు.

షో రన్నర్ క్రిష్ మాట్లాడుతూ…టెలివిజన్ సీరియల్స్ నిర్మించడం ఖర్చుతో, శ్రమతో కూడిన పని. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చాక ఒక మంచి కథను వెబ్ సిరీస్ గా చూపించే వీలు దొరికింది. అందుకు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ వాళ్లకు కృతజ్ఞతలు చెబుతున్నా. మల్లాది గారి రచనలకు నేను అభిమానిని. మా నిర్మాణ సంస్థ నుంచి ఆయన నవలలు కొన్ని రైట్స్ తీసుకున్నాం. ఇంకొన్ని తీసుకోబోతున్నాం. మల్లాది రచన నుంచి వస్తున్న తొలి వెబ్ సిరీస్ 9 అవర్స్. రియల్ టైమ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది. నా గమ్యం సినిమాను కన్నడలో చేసిన జాకోబ్ వర్గీస్, యాడ్ ఫిల్మ్ మేకర్ నిరంజన్ ఈ వెబ్ సిరీస్ ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అన్నారు.

తారకరత్న మాట్లాడుతూ…9 అవర్స్ వెబ్ సిరీస్ లో నాకు బాగా నచ్చిన అంశం. ఇందులో ప్రతి క్యారెక్టర్ బాగుండటం. చాలా రోజుల తర్వాత సెట్ లో ఎంజాయ్ చేశాను. ఇద్దరు దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో పార్ట్ డైరెక్షన్ చేస్తూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. బ్యాంక్ దొంగతనం అనేది దీంట్లో ఒక భాగం మాత్రమే. కథలో ఇంకా కొత్త విషయాలు ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ ను కుటుంబమంతా కలిసి చూడొచ్చు. క్రిష్ గారి ఆధ్వర్యంలో గుర్తుండిపోయే వెబ్ సిరీస్ చేయగలిగాం అన్నారు.

అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.